ఓటీటీలోకి మరో భాషలో వచ్చిన రూ.260కోట్ల మలయాళ బ్లాక్‍బస్టర్ సినిమా: వివరాలివే

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి మరో భాషలో వచ్చిన రూ.260కోట్ల మలయాళ బ్లాక్‍బస్టర్ సినిమా: వివరాలివే

ఎల్2: ఎంపురాన్ చిత్రం ఓటీటీలో మంచి వ్యూస్ సాధిస్తోంది. తాజాగా మరో భాష కూడా యాడ్ అయింది. దీంతో ఈ యాక్షన్ మూవీ మరింత జోరు చూపే అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇవే..

ఓటీటీలోకి మరో భాషలో వచ్చిన రూ.260కోట్ల మలయాళ బ్లాక్‍బస్టర్ సినిమా: వివరాలివే

మలయాళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఎల్2: ఎంపురాన్ భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది. సూపర్ స్టార్ మోహన్‍లాల్ హీరోగా నటించిన ఈ మూవీకి పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. పృథ్వి ఓ కీలకపాత్రలోనూ నటించారు. లూసిఫర్ మూవీకి సీక్వెల్‍గా ఈ చిత్రం తెరకెక్కింది. మార్చి 27న థియేటర్లలో విడుదలైన ఎంపురాన్ మూవీ సూపర్ హిట్ కొట్టింది. ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. ఈ తరుణంలో మరో భాషలోనూ ఈ చిత్రం అందుబాటులోకి వచ్చేసింది.

హిందీలోనూ స్ట్రీమింగ్

ఎల్2: ఎంపురాన్ సినిమా హిందీలోనూ జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 24న మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో హాట్‍స్టార్‌ ఓటీటీలో అడుగుపెట్టింది. ఇప్పుడు తాజాగా హిందీ వెర్షన్ కూడా వచ్చేసింది.

మరింత జోష్

థియేట్రికల్ రన్‍లో బ్లాక్‍బస్టర్ కొట్టిన ఎంపురాన్.. ఓటీటీలోనూ అదరగొడుతోంది. జియో హాట్‍స్టార్ ఓటీటీలో కొన్ని రోజులు నాలుగు భాషల్లోనూ టాప్‍లో ట్రెండ్ అయింది. ఇప్పటికే టాప్-5లోనే కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు హిందీ వెర్షన్ కూడా వచ్చేసింది. దీంతో ఎంపురాన్ మూవీకి జియోహాట్‍స్టార్‌లో మరింత జోష్ వచ్చే అవకాశం ఉంది. వ్యూస్ పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది.

ఎంపురాన్ రికార్డు కలెక్షన్లు

ఎల్2: ఎంపురాన్ సినిమా సుమారు రూ.260కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. వివాదాలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ మూవీ దుమ్మురేపింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన మలయాళ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ సుమారు రూ.175కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. అత్యధిక బడ్జెట్‍తో తెరకెక్కిన మలయాళ మూవీగానూ ఇది నిలిచింది.

పాలిటిక్స్, ఇంటర్నేషనల్ గ్యాంగ్‍స్టర్స్ అంశాలతో ఎల్2: ఎంపురాన్ మూవీని యాక్షన్ థ్రిల్లర్‌గా డైరెక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ తెరకెక్కించారు. గ్రాండ్ స్కేల్‍లో ఈ మూవీని తీసుకొచ్చారు. ఈ చిత్రంలో మోహన్‍లాల్, పృథ్వి పాటు టొవినో థామస్, అభిమన్యు సింగ్, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, జిరోమ్ ఫ్లిన్, ఆండ్రియా తివదార్, బైజు సంతోష్ కీరోల్స్ చేశారు.

ఎల్2: ఎంపురాన్ మూవీని ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్, శ్రీగోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరంబవూర్, సుభాస్కరన్, గోకులం గోపాలన్ ప్రొడ్యూజ్ చేశారు. దీపక్ దేవ్ సంగీతం అందించిన ఈ చిత్రానిక సుజీత్ వాసుదేవన్ సినిమాటోగ్రఫీ చేశారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024