





Best Web Hosting Provider In India 2024

హోటల్ రూమ్ నుంచి వెళ్లిపోయేటప్పుడు ఈ 5 వస్తువులను మీరు తీసుకెళ్ళవచ్చు, ఇది దొంగతనం కాదు, మీ హక్కు!
హోటల్ రూమ్ ఖాళీ చేసి వెళ్తున్నప్పుడు కొన్ని వస్తువులను మీతో పాటు తీసుకెళ్లవచ్చని మీకు తెలుసా? చాలామంది దొంగతనం అవుతుందేమో అని భయపడతారు. నిజానికి మీరు చెల్లించిన అద్దెలో భాగంగా కొన్ని వస్తువులపై మీకు పూర్తి హక్కు ఉంటుంది. వాటిని మీతో తీసుకెళ్లడం దొంగతనం కాదు. ఈ 5 రకాల వస్తువులు ఏంటో చూడండి.
మీరు ఆఫీసు పని మీద బయటకి వెళ్లినప్పుడు లేదా సెలవుల్లో ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు హోటల్‌లో స్టే చేయడం సహజమే. హోటల్లో ఉండే మంచి వాతావరణం, ప్రశాంతమైన గది, వాళ్ళిచ్చే మంచి సేవలు అందరికీ నచ్చుతాయి. అయితే హోటల్ రూమ్‌లో ఉండే కొన్ని వస్తువులు మన కోసం మాత్రమేనని, వాటిని మనం ఇంటికి తీసుకెళ్లచ్చని మీకు తెలుసా? ఉంటాయని మీకు తెలుసా? అవును హోటల్ గదుల్లో ఉండే కొన్ని రకాల వస్తువులు మనం కడుతున్న అద్దెలో భాగంగా మనకు వాళ్లు ఇచ్చేవి. వాటిని మనం నిర్భయంగా ఇంటికి తీసుకెళ్లచ్చు.
చాలా మందికి ఈ విషయం తెలియక హోటల్ నుంచి వస్తువులను తీసుకెళ్లడం దొంగతనం అవుతుందేమో భయపడుతుంటారు. నిజం చెప్పాలంటే చాలా హోటల్స్ వాళ్ళ దగ్గరికి వచ్చిన కస్టమర్లకు మంచి అనుభూతి ఇవ్వడానికి కొన్ని చిన్న చిన్న వస్తువులు ఇస్తుంటాయి. వీటిని ఉపయోగించడం, ఇంటికి తీసుకెళ్లడం మన హక్కు. మనం హోటల్ కి కట్టిన డబ్బుల్లోనే ఈ వస్తువుల ఖర్చు కూడా కలిసి ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకెళ్లడం దొంగతనం కానే కాదు. కాబట్టి ఈసారి మీరు ఏదైనా హోటల్‌లో బస చేసినప్పుడు ఏ వస్తువులను మీరు నిర్భయంగా మీ బ్యాగులో పెట్టుకోవచ్చో తెలుసుకోండి.
1. బాత్రూమ్‌లో ఉన్న వస్తువులు
మీరు మంచి హోటల్‌లో ఉంటే అక్కడ బాత్రూమ్‌లో షాంపూ, కండిషనర్, బాడీ వాష్, సబ్బు, మాయిశ్చరైజర్ వంటి వస్తువులు మీ సౌకర్యం కోసం అందుబాటులో ఉంటాయి. వీటిని మీరు నిర్భయంగా ఇంటికి తీసుకెళ్ళవచ్చు. ఈ వస్తువులు ప్రత్యేకంగా అతిథుల కోసం మాత్రమే ఉంటాయి. అద్దెలా భాగంగానే వీటిని మీకోసం వారు అందిస్తారు. అలాగే ప్రతి కొత్త అతిథి కోసం హోటల్ యాజమాన్యం వీటిని మారుస్తూ ఉంటుంది. కాబట్టి వాటిని మీరు నిర్భయంగా తీసుకెళ్ళవచ్చు.
2. బాత్రూమ్ స్లిప్పర్లు కూడా మీవే
హోటల్‌లో లభించే డిస్పోజబుల్ చెప్పులు సాధారణంగా ఒకసారి మాత్రమే ఉపయోగించడానికి ఉంటాయి. ఒకసారి మీరు వాటిని ఉపయోగించిన తర్వాత తదుపరి అతిథి కోసం వాటిని తీసేసి వేరే వాటిని ఉంచుతారు. కాబట్టి మీ గదిలోని బాత్రూమ్ స్లిప్పర్లను మీరు నిస్సందేహంగా ఇంటికి తీసుకెళ్ళవచ్చు. మీ మిగతా ప్రయాణంలో వాటిని ఉపయోగించుకోవచ్చు.
3. స్టేషనరీ వస్తువులను కూడా తీసుకెళ్ళవచ్చు
హోటల్‌లో లభించే పెన్నులు, నోట్‌ప్యాడ్‌లు లేదా పోస్ట్‌కార్డులు వంటి వస్తువులు సాధారణంగా హోటల్ బ్రాండ్‌తో వస్తాయి. ఈ వస్తువులు ఉపయోగకరమైనవి మాత్రమే కాదు, ప్రయాణ జ్ఞాపకాలను నిలిపి ఉంచేందుకు సహాయపడతాయి. కాబట్టి, మీ హోటల్ గదిలో ఈ వస్తువులు ఉంటే మీరు వాటిని కూడా తీసుకెళ్ళవచ్చు.
4. టీ-కాఫీ కండిమెంట్స్
హోటల్ గదిలో లభించే ఇన్‌స్టంట్ కాఫీ, టీ బ్యాగులు, చక్కెర ప్యాకెట్లు, క్రీమర్ మొదలైనవి కూడా కేవలం మీ ఉపయోగం కోసం మాత్రమే ఉంటాయి. ఈ చిన్న ప్యాకెట్లను సులభంగా బ్యాగులో ఉంచవచ్చు, ఇవి మీకు ఇంట్లో లేదా మీ తదుపరి ప్రయాణంలో ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ఈ వస్తువులను కూడా నిర్భయంగా ఇంటికి తీసుకెళ్ళవచ్చు.
5. షూ షైన్ కిట్, షవర్ కాప్
కొన్ని హోటళ్ళు తమ అతిథులకు అదనపు సౌకర్యాలను అందించడం కోసం వారికి షవర్ కాప్, షూ షైన్ కిట్ వంటి వస్తువులను అందిస్తాయి. ఇవి చాలా చిన్నవి అయినప్పటికీ చాలా ఉపయోగకరమైనవి. ఇవి కూడా అద్దెలో భాగంగా మీకు లభించేవే. కాబట్టి వీటిని కూడా మీరు మీతో పాటు నిర్భయంగా తీసుకెళ్ళవచ్చు.
టాపిక్