




Best Web Hosting Provider In India 2024

టీజీ లాసెట్ – 2025కు దరఖాస్తు చేసుకున్నారా..? ఇదే లాస్ట్ ఛాన్స్, దగ్గరపడిన గడువు
తెలంగాణ లాసెట్ – 2025 దరఖాస్తుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఆలస్య రుసుంతో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే రూ.4 వేల ఫైన్ తో మే 25వ తేదీ వరకు అవకాశం ఉంది. ఈ గడువు పూర్తయితే మొత్తం దరఖాస్తుల ప్రక్రియ పూర్తవుతుంది.
తెలంగాణ లాసెట్ – 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆలస్య రుసుంతో అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. రూ. 4 వేల ఫైన్ తో రేపటి (మే 25) వరకు అవకాశం ఉంది. దీంతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. ఆ తర్వాత అప్లికేషన్ల స్వీకరణకు అవకాశం ఉండదు. అర్హతుల, ఆసక్తి ఉన్నవారు… వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
టీజీ లాసెట్ – 2025 ఎంట్రెన్స్ ద్వారా మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సులతో పాటు పీజీ కోర్సుల్లోనూ ప్రవేశాలను కల్పిస్తారు. 2025-26 విద్యాసంవత్సరానికి ఈ అడ్మిషన్లు ఉంటాయి. ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష బాధ్యతలను నిర్వహిస్తోంది.
టీజీ లాసెట్ అప్లికేషన్ ప్రాసెస్ ఇలా…
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించ్ ఆన్ లైన్ అప్లికేషన్ పై క్లిక్ చేయాలి.
- ముందుగా నిర్ణయించిన ఫీజును చెల్లించాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.
- అప్లికేషన్ ఫామ్ లో మీ వివరాలను నమోదు చేయాలి. ఫొటోతో పాటు సంతకాన్ని అప్ లోడ్ చేయాలి.
- చివరగా సబ్మిట్ నొక్కితే ప్రాసెస్ పూర్తవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
తెలంగాణ లాసెట్ – 2025కు అప్లయ్ చేసుకునేవాళ్లు…. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులు రూ. 900, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 600 చెల్లించాలి. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ. 1100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 900 చెల్లించాలి. ఇవి కాకుండా ఆలస్య రుసుం చెల్లించి ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యను పూర్తి చేసి ఉండాలి. ఎల్ఎల్ఎం ప్రవేశాలకు డిగ్రీతోపాటు ఎల్ఎల్బీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి వయోపరిమితి లేదు.
అందుబాటులోకి ఎడిట్ ఆప్షన్….
మరోవైపు దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ మే 20వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. మే 25వ తేదీతో ఈ గడువు ముగుస్తుంది. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు ఉంటే అభ్యర్థులు సవరించుకోవచ్చు.
లాసెట్ హాల్ టికెట్లు మే 30వ తేదీన విడుదలవుతాయి. జూన్ 6వ తేదీన ఎగ్జామ్ ఉంటుంది. ఉదయం సమయంలో మూడేళ్ల కోర్సు ప్రవేశ పరీక్ష, మద్యాహ్నం ఐదేళ్ల కోర్సు, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎగ్జామ్ ఉటుంది. రాత పరీక్ష పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటిస్తారు. ఆ తర్వాత రిజల్ట్స్ ను వెల్లడిస్తారు. ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్