



Best Web Hosting Provider In India 2024

తిరుమలలో భక్తుల రద్దీ – నిండిపోయిన కంపార్టుమెంట్లు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావటంతో శ్రీనివాసుడి దర్శనం కోసం భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులతో పాటు వీకెండ్ కావటంతో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీనివాసుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ చర్యలు చేపట్టింది.
సర్వదర్శనానికి 24 గంటలు…
ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వెలుపల క్యూ లైన్‌లో కూడా భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
ఇక శుక్రవారం తిరుమల శ్రీవారిని 74,374భక్తులు దర్శించుకున్నారని టీటీడీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.37,477 మంది భక్తులు తలనీలాలను సమర్పించగా… హుండీ కానుకలు రూ. 3.02 కోట్లుగా ఉంది.
గురువారం రోజు రికార్డు స్థాయిలో:
వేసవి రద్దీ నేపథ్యంలో తిరుమలలో గత వారం రోజులుగా భక్తుల తాకిడి పెరిగింది. సాధారణంగా గురువారం ఉదయం తిరుప్పావడ సేవ, సాయంత్రం పూలంగి సేవ ఉన్న కారణంగా భక్తులకు దర్శన సాధారణంగా రెండు మూడు గంటలు పైగా తగ్గుతుంది. సాధారణంగా కేవలం 62 నుండి 63 వేల మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటారు.
అయితే ఈ గురువారం టీటీడీ అధికారులు …. తిరుమలలోని అన్ని విభాగాలను ఎప్పటికప్పుడు సమన్వయపరిచేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా తొలిసారి గురువారం నాడు 72,579 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందుకు సంంబధించిన వివరాలను టీటీడీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
టీటీడీ ఈవో ఆకస్మిక తనిఖీలు:
తిరుమలలోని సహజ శిలా తోరణం మరియు చక్ర తీర్థాన్ని శుక్రవారం టీటీడీ ఈవో ఆకస్మిక తనిఖీ చేశారు. పార్కింగ్, శుభ్రత, మొదలైన అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం చక్ర తీర్థం రాతి కొండలో చెక్కి ఉన్న శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్, నరసింహ స్వామి, ఆంజనేయ స్వామి ప్రతిమలతో పాటు శ్రీ శివుని సాన్నిధ్యాన్ని పరిశీలించారు. ఆ ప్రాంగణంలో పరిశుభ్రత మెరుగుపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి శుక్రవారం దర్శన క్యూలైన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. క్యూలైన్లలో శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్న అన్న ప్రసాదాలు, పాలు, తాగునీటిపై ఆరా తీశారు. టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తుల నుండి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
సంబంధిత కథనం
టాపిక్