





Best Web Hosting Provider In India 2024

తన సినిమాకు పోటీగా దిగిన చిత్రాన్ని ప్రశంసించిన సూర్య.. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే!
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా టీమ్ సూర్యను కలిసింది. ఈ చిత్రాన్ని ఆయన ప్రశంసించారని డైరెక్టర్ వెల్లడించారు. తమను అభినందించారని తెలిపారు. ఆ వివరాలు ఇవే..
తమిళంలో మే 1న ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ క్లాష్ జరిగింది. స్టార్ హీరో సూర్య నటించిన రెట్రోకు పోటీగా తక్కువ బడ్జెట్ మూవీ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ వచ్చింది. అయితే, టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం పాజిటివ్ టాక్ అందుకుంది. అంచనాలకు మించి బ్లాక్‍బస్టర్ సాధించింది. రెట్రో లాంటి పెద్ద సినిమాను తట్టుకొని నిలిచి భారీ సక్సెస్ కొట్టింది. తాజాగా తన చిత్రంపై పోటీకి దిగిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా టీమ్‍ను సూర్య అభినందించారు. మంచి మనసు చూపారు.
అభినందించిన సూర్య
తమ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాను సూర్య చూశారని, ప్రశంసించారని ఆ మూవీ దర్శకుడు అభిషాన్ జీవినిత్ తెలిపారు. ఈ మూవీ టీమ్‍ను పిలిపించుకొని మరీ అభినందించారు సూర్య. ఈ విషయాన్ని జీవినిత్ వెల్లడించారు. “ఎలా వివరించాలో అర్థం కావడం లేదు. లోలోపల చాలా ఆనందంగా, హాయిగా ఉంది. సూర్య సర్ నా పేరు పిలిచారు. టూరిస్ట్ ఫ్యామిలీ ఎంతగా నచ్చిందో చెప్పారు. వీ1000 (వారనమ్ అయిరామ్) సినిమాను 100వసారి చూస్తున్న పిల్లాడు ఇంకా నాలోనే ఉన్నాడు. ఆ పిల్లాడు ఇప్పుడు సంతోషంగా కన్నీరు పెట్టుకుంటున్నాడు. థాంక్యూ” అని జీవినిత్ ట్వీట్ చేశారు.
టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ జీవినిత్‍తో పాటు తనను కలిసేందుకు వచ్చిన టీమ్ సభ్యులకు బొకేలు ఇచ్చి అభినందించారు సూర్య. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు పోటీగా దిగిన సినిమా అని కూడా భావించకుండా ప్రశంసించిన సూర్యది మంచి మనసు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
రూ.75కోట్లు దాటిన కలెక్షన్లు.. రాజమౌళి ప్రశంస
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలో శశికుమార్, సిమ్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీలంక నుంచి తమిళనాడుకు వలస వచ్చిన ఓ కుటుంబం చుట్టూ ఈ మూవీ ఉంటుంది. ఈ చిత్రాన్ని హృదయాన్ని హత్తుకునేలా తెరకెక్కించారు డైరెక్టర్ జీవినిత్. సుమారు రూ.16కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే రూ.75కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసి భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది.
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ప్రశంసించారు. అద్భుతమైన సినిమా అని, అందరూ తప్పకుండా చూడాలంటూ ట్వీట్ చేశారు.
ఓటీటీలోకి ఎప్పుడు?
ముందు జరిగిన డీల్ ప్రకారం మే నెలాఖరులోనే టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా మే చివర్లో జియోహాట్‍స్టార్ ఓటీటీలోకి రావాల్సింది. అయితే, ఈ చిత్రానికి ఇంకా థియేట్రికల్ రన్ జోరుగా సాగుతోంది. దీంతో స్ట్రీమింగ్‍కు ప్లాన్ మేకర్స్ మార్చేశారు. జూన్ తొలి వారంలో ఈ చిత్రాన్ని జియోహాట్‍స్టార్ ఓటీటీలో తీసుకొచ్చేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
సంబంధిత కథనం