



Best Web Hosting Provider In India 2024
ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వేపై జంట శృంగారం.. తమ పార్టీ నేత కాదని బీజేపీ క్లారిటీ!
ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వేపై జంట శృంగారం చేస్తున్న వీడియో వైరల్ అయింది. ఇందులో ఉన్నది బీజేపీ నేత అంటూ ప్రచారం జరిగింది. అయితే దీనిపై కాషాయ పార్టీ స్పందించింది.
ధ్యప్రదేశ్లో మనోహర్ లాల్ ధాకడ్ అనే వ్యక్తి బరితెగించాడు. ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వేపై మహిళతో శృంగారం చేశాడు. ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆ తర్వాత బయటకు వచ్చి తెగ వైరల్ అయింది. అయితే సోషల్ మీడియాలో మనోహర్ లాల్ ధాకడ్ బీజేపీ నేత అంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఆ పార్టీ స్పందించింది.
మే 13న రికార్డ్ అయిన ఈ దృశ్యాలు ధాకడ్ పేరు మీద రిజిస్టర్ అయినట్లు ఉన్న కారుగా గుర్తించారు. అయితే ధాకడ్కు తమ పార్టీతో సంబంధం ఉందన్న వార్తలను భారతీయ జనతా పార్టీ ఖండించింది. ‘ధాకడ్ బానీ గ్రామానికి చెందినవాడు, అతను బీజేపీలో ప్రాథమిక సభ్యుడు కాదు.’ అని మందసౌర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజేష్ దీక్షిత్ చెప్పారు.
అయితే ధాకడ్ భార్య బీజేపీ మద్దతు ఉన్న జిల్లా పంచాయతీ సభ్యురాలు. ప్రస్తుతం ఆమె మంద్సౌర్ జిల్లా పంచాయతీలోని 8వ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మనోహర్ లాల్ పార్టీలో లేరని బీజేపీ చెబుతోంది.
మధ్యప్రదేశ్ పోలీసులు శుక్రవారం ధాకడ్పై కేసు నమోదు చేశారు. దీనిపై మంద్సౌర్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మనోజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ‘దర్యాప్తులో భన్ పురాలోని ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే వద్ద ఘటన జరిగింది. మనోహర్ ధాకడ్తో పాటు మరో వ్యక్తిపై 296 (బహిరంగ ప్రదేశాల్లో అశ్లీల చర్య), 285 (బహిరంగ మార్గానికి ఆటంకం కలిగించడం), 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం.’ అని చెప్పారు.
ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి ధాకడ్ ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని తెలుస్తోంది. స్పందన కోసం ఆయనను సంప్రదించలేకపోయినట్టుగా పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.
Best Web Hosting Provider In India 2024
Source link