




Best Web Hosting Provider In India 2024

మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రెండు చిత్రాలు.. రష్మిక బాలీవుడ్ మూవీ.. ఓ తెలుగు చిత్రం స్ట్రీమింగ్
ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో రెండు చిత్రాలు స్ట్రీమింగ్‍కు రానున్నాయి. సల్మాన్ ఖాన్, రష్మిక నటించిన బాలీవుడ్ సినిమా అడుగుపెట్టనుంది. ఓ తెలుగు చిత్రం కూడా అందుబాటులోకి రానుంది.
ఓటీటీల్లోకి రేపు (మే 25) రెండు సినిమాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. బాలీవుడ్ మూవీ ‘సికందర్’ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. థియేటర్లలో ప్లాఫ్ అయిన ఈ చిత్రం దాదాపు ఎనిమిది వారాలకు ఓటీటీలోకి వస్తోంది. కథాసుధలో భాగంగా తక్కువ నిడివి ఉండే ఓ తెలుగు చిత్రం కూడా రేపే స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ అర్ధరాత్రి అంటే మరికొన్ని గంటల్లోనే ఈ రెండు సినిమాల స్ట్రీమింగ్ మొదలుకానుంది. ఆ వివరాలు ఇవే..
సికందర్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన సికందర్ చిత్రం రేపు (మే 25) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. మార్చి 30వ తేదీన ఈ బాలీవుడ్ యాక్షన్ మూవీ థియేటర్లలో విడుదలైంది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ప్లాఫ్‍గా నిలిచింది.
సికందర్ చిత్రం సుమారు రూ.200కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. దాదాపు రూ.170కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకొని థియేట్రికల్ రన్‍లో ఈ చిత్రం సక్సెస్ కాలేకపోయింది. సుమారు ఎనిమిది వారాలకు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తోంది. ఈ చిత్రాన్ని సాజిద్ నదియద్‍వాలా ప్రొడ్యూజ్ చేశారు. ప్రితమ్, సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
ఓటీటీలోనైనా సక్సెస్ అవుతుందా!
సికందర్ చిత్రం రిలీజైనప్పుడు నెగెటివ్ రెస్పాన్స్ ఎక్కువగా వచ్చింది. ట్రోల్స్ కూడా సోషల్ మీడియాలో జోరుగా నడిచాయి. ఏఆర్ మురగదాస్ టేకింగ్ అసలు బాగోలేదని, ఔట్‍డేటెడ్ అంటూ కొందరు కామెంట్లు చేశారు. సల్మాన్ లుక్ కూడా మెప్పించలేదంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రేపు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చాక సికందర్ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అనే ఆసక్తి నెలకొంది. ఓటీటీ స్ట్రీమింగ్‍కు ఈ చిత్రం సక్సెస్ అవుతుందా అనేది చూడాలి.
నాతిచరామి
తనికెళ్ల భరణి, రాజ్యలక్ష్మి ప్రధాన పాత్రలు పోషించిన నాతిచరామి సినిమా రేపు (మే 25) ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. కథాసుధలో భాగంగా ఈ చిత్రాన్ని ఆ ప్లాట్‍ఫామ్ స్ట్రీమింగ్‍కు తెస్తోంది. ఈ మూవీకి సతీశ వేగేష్న దర్శకత్వం వహించారు.
నాతిచరామి స్టోరీలైన్
ఫ్యామిలీ డ్రామా మూవీగా నాతిచరామి రూపొందింది. తన భార్య జానకి (రాజ్యలక్ష్మి) మిస్ అయిందని పోలీస్ స్టేషన్‍లో ఫిర్యాదు చేస్తాడు వీరభద్రం (తనికెళ్లభరణి). అయితే, అమెరికాలో తన పిల్లల వద్ద జానకి ఉందని ఎస్ఐ ప్రభాకర్ గుర్తిస్తాడు. తప్పుడు కంప్లైంట్ ఇచ్చినదుకు పెట్టినందుకు వీరభద్రంపై కోప్పడతాడు.
తాను ఎందుకు అలా చేశానో ఎస్‍ఐకు వీరభద్రం చెబుతాడు. భార్య తప్పిపోయిందని వీరభద్రం ఎందుకు కంప్లైట్ ఇచ్చాడు? కుటుంబంలో ఎందుకు విభేదాలు వచ్చాయి? చివరికి ఏం జరిగిందనేది నాతిచరామి సినిమాలో ఉంటాయి. ఈ మూవీ రన్‍టైమ్ తక్కువగానే ఉంటుంది. ఈ అర్ధరాత్రి నుంచి ఈటీవీ విన్‍లో చూడొచ్చు.
నాతిచరామి చిత్రంలో తనికెళ్లభరణి, రాజ్యలక్షితో పాటు సతీశ్, విన్ని, బ్రహ్మణి కీలకపాత్రలు పోషించారు. ఎస్‍కే బాలచందర్ సంగీతం అందించారు. దర్శకుడు సతీశ్ వేగేశ్ననే ప్రొడ్యూజ్ చేశారు.
సంబంధిత కథనం