




Best Web Hosting Provider In India 2024

అఫీషియల్- స్పిరిట్ హీరోయిన్ కన్ఫామ్ – ప్రభాస్ మూవీతో టాలీవుడ్లోకి యానిమల్ బ్యూటీ ఎంట్రీ!
ప్రభాస్ స్పిరిట్ మూవీలో హీరోయిన్ ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్గా కన్ఫామ్ అయ్యింది. ఈ విషయాన్ని శనివారం ట్విట్టర్ ద్వారా సందీప్ వంగా వెల్లడించాడు. సందీప్ వంగా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రభాస్, డైరెక్టర్ సందీప్ వంగా కాంబినేషన్లో తెరకెక్కుతోన్న స్పిరిట్ మూవీలో హీరోయిన్ ఎవరన్నది కన్ఫామ్ అయ్యింది. ఈ పాన్ వరల్డ్ మూవీలో ప్రభాస్‌కు జోడీగా యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి నటించబోతున్నది. ఈ విషయాన్ని శనివారం ట్విట్టర్ ద్వారా డైరెక్టర్ సందీప్ వంగా అఫీషియల్‌గా ప్రకటించాడు. స్పిరిట్‌లో త్రిప్తి డిమ్రి ఫిమేల్ లీడ్‌గా నటించనున్నట్లు వెల్లడించాడు. సందీప్ వంగా ట్వీట్లో త్రిప్తి డిమ్రి పేరు ఎనిమిది భాషల్లో కనిపిస్తోంది. భారతీయ భాషలతో పాటు కొరియన్, చైనీస్ లాంగ్వేజెస్‌లో త్రిప్తి డిమ్రి పేరును రివీల్ చేయడం ఆసక్తిని పంచుతోంది.
రుణపడి ఉంటా…
స్పిరిట్ మూవీలో తనకు హీరోయిన్గా ఛాన్స్ దక్కడంపై త్రిప్తి డిమ్రి కూడా ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ జర్నీలో మరోసారి నన్ను నమ్మినందుకు మీకు రుణపడి ఉంటా. మీ విజన్‌లో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నా అంటూ సందీప్ వంగాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. సందీప్ వంగా ట్వీట్‌తో పాటు త్రిప్తి డిమ్రి ట్వీట్ వైరల్ అవుతోన్నాయి.
యానిమల్తో ఎంట్రీ…
గతంలో సందీప్ వంగా తో యానిమల్ మూవీ చేసింది త్రిప్తి డిమ్రి. ఈ యాక్షన్ డ్రామా మూవీలో ఓ బోల్డ్ రోల్లో కనిపించింది. యానిమల్‌లో రణభీర్‌కపూర్‌తో త్రిప్తి డిమ్రి రొమాన్స్, ఇంటిమేట్ సీన్స్ వైరల్ అయ్యాయి. యానిమల్ మూవీతోనే ఓవర్‌నైట్‌లో స్టార్‌గా మారిపోయింది. యానిమల్ తర్వాత మరోసారి త్రిప్తి డిమ్రికి స్పిరిట్ మూవీలో సందీప్ వంగా ఛాన్స్ ఇవ్వడం, అది కూడా హీరోయిన్గా ప్రమోషన్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
దీపికా పదుకోణ్…
స్పిరిట్ మూవీలో హీరోయిన్గా దీపికా పదుకోణ్, మృణాల్ ఠాకూర్‌తో పాటు పలువురు హీరోయిన్లు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమా నుంచి దీపికా తప్పుకున్నట్లు కూడా ఇటీవల వార్తలు వినిపించాయి. ఈ పుకార్ల నేపథ్యంలో త్రిప్తి డిమ్రి పేరును అఫీషియల్‌గా సందీప్ వంగా ప్రకటించాడు.
పాన్ వరల్డ్ మూవీ…
పాన్ వరల్డ్ మూవీగా స్పిరిట్‌ను సందీప్ వంగా తెరకెక్కిస్తోన్నారు. కాప్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత సినిమాలకు భిన్నంగా ఇంటెన్స్‌గా అతడి రోల్ సాగనున్నట్లు సమాచారం. కొరియన్ యాక్టర్ డాంగ్ లీ మూవీలో విలన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మ్యూజిక్ సిట్టింగ్స్…
స్పిరిట్ మూవీకి సంబంధించి ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.
కాగా ప్రస్తుతం ప్రభాస్…రాజాసాబ్తో పాటు హను రాఘవపూడి మూవీ షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. వీటితో పాటు సలార్ 2, కల్కి సినిమాలు చేయాల్సివుంది.
సంబంధిత కథనం
టాపిక్