గుండె నిండా గుడి గంట‌లులో అత్త.. అల్లుడు…మా ఇంటి దేవ‌త‌లో త‌ల్లీకొడుకులు – విష్ణుకాంత్‌, ఉష‌శ్రీ కాంబో సూప‌ర్ హిట్‌

Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంట‌లులో అత్త.. అల్లుడు…మా ఇంటి దేవ‌త‌లో త‌ల్లీకొడుకులు – విష్ణుకాంత్‌, ఉష‌శ్రీ కాంబో సూప‌ర్ హిట్‌

Nelki Naresh HT Telugu

గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్‌లో విష్ణుకాంత్‌, ఉష‌శ్రీ అల్లుడు…అత్త పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు. జెమిని టీవీలో టెలికాస్ట్ అవుతోన్న మా ఇంటి దేవ‌త సీరియ‌ల్‌లో త‌ల్లీకొడుకుల‌తో న‌టిస్తోన్నారు. డిఫ‌రెంట్ రోల్స్‌లో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోన్నారు.

గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్‌

గుండె నిండా గుడి గంట‌లు…ప్ర‌స్తుతం స్టార్ మాలో టాప్ సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా కొన‌సాగుతోంది. ఈ సీరియ‌ల్‌లో విష్ణుకాంత్‌, అమూల్య‌గౌడ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు. గుండె నిండా గుడి గంట‌లులో అమూల్య‌గౌడ త‌ల్లి పాత్ర‌లో సీనియ‌ర్ న‌టి ఉష‌శ్రీ క‌నిపిస్తోంది. భ‌ర్త దూరం కావ‌డంతో కుటుంబ బాధ్య‌త‌ల్ని మోస్తూ క‌ష్టాల‌కు ఎదురీదే త‌ల్లి పాత్ర‌లో ఉష‌శ్రీ ఎమోష‌న‌ల్ రోల్‌లో మెప్పిస్తోంది. బాలును గౌర‌విస్తూనే ద్వేషించే అత్తగా ఉష‌శ్రీ క‌నిపిస్తోంది.

మా ఇంటి దేవ‌త‌…

గుండె నిండా గుడి గంట‌లుతో పాటు ప్ర‌స్తుతం విష్ణుకాంత్‌, ఉష‌శ్రీ క‌లిసి మ‌రో సీరియ‌ల్ కూడా చేస్తోన్నారు. జెమిని టీవీలో టెలికాస్ట్ అవుతోన్న మా ఇంటి దేవ‌త సీరియ‌ల్‌లో విష్ణ‌కాంత్ లీడ్‌రోల్‌లో న‌టిస్తోండ‌గా…అత‌డి త‌ల్లిగా ఉష‌శ్రీ క‌నిపిస్తోంది. మా ఇంటి దేవ‌త సీరియ‌ల్‌కు విష్ణుకాంత్‌, ఉష‌శ్రీ సెంటిమెంట్‌, ఎమోష‌న‌ల్ సీన్స్ హైలైట్‌గా నిలుస్తోన్నాయి.

అత్త అల్లుడు…త‌ల్లీ కొడుకులు…

గుండె నిండా గుడి గంట‌లులో అత్త‌, అల్లుడిగా న‌టిస్తోన్న విష్ణుకాంత్‌, ఉష‌శ్రీ…మా ఇంటి దేవ‌త సీరియ‌ల్‌లో త‌ల్లి కొడుకులుగా క‌నిపిస్తోన్నారు. రెండు డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్‌లో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోన్నారు.

టీఆర్‌పీ రేటింగ్‌…

లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో గుండె నిండా గుడి గంట‌లు 10.07 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. కార్తీక దీపం 2, ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు, ఇంటింటి రామాయ‌ణం త‌ర్వాత ప్లేస్‌లో నిలిచింది. అర్బ‌న్ ఏరియాలో మాత్రం టాప్ త్రీ సీరియ‌ల్‌గా కొన‌సాగుతోంది.

భైర‌వి త‌ర్వాత‌…

మ‌రోవైపు మా ఇంటి దేవ‌త సీరియ‌ల్‌కు 0.91 రేటింగ్ వ‌చ్చింది. భైర‌వి (1.35 ) త‌ర్వాత జెమిని టీవీలో హ‌య్యెస్ట్ టీఆర్‌పీ ద‌క్కించుకున్న సీరియ‌ల్‌గా మా ఇంటి దేవ‌త నిలిచింది.

ఇంటింటి రామాయ‌ణం…

గుండె నిండా గుడి గంట‌లుతో పాటు స్టార్ మా లో ఇంటింటి రామాయ‌ణం సీరియ‌ల్ లో కూడా న‌టిస్తోంది ఉష‌శ్రీ. తెలుగులో వ‌దిన‌మ్మ‌, గుప్పెడంత మ‌న‌సు, అంత‌రంగాలు, శివ‌లీల‌లుతో పాటు ప‌లు సీరియ‌ల్స్ ఉష‌శ్రీకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. కొన్ని సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించింది.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024