




Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ మూవీ – క్షుద్రపూజల కాన్సెప్ట్ – ఏడాది తర్వాత స్ట్రీమింగ్!
అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటించిన తెలుగు హారర్ మూవీ తంత్ర థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత మరో ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నఈ మూవీ శనివారం సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది.
తెలుగు మూవీ తంత్ర ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ హారర్ మూవీ మరో ఓటీటీలోకి వచ్చింది. శనివారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. థియేటర్లలో రిలీజైన ఈ ఏడాది తర్వాత ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కావడం గమనార్హం.
అనన్య నాగళ్ల హీరోయిన్…
అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో సలోని, ధనుష్ రఘుముద్రి, టెంపర్ వంశీ కీలక పాత్రలు పోషించారు. ఈ హారర్ మూవీకి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించాడు. గత ఏడాది మార్చిలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.
చిన్న పిల్లలు తమ సినిమాను చూడొద్దంటూ వెరైటీ ప్రమోషన్స్‌తో ఈ చిన్న సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. కానీ ప్రమోషన్స్‌లో ఉన్న క్రియేటివి కథలో లేకపోవడంతో యావరేజ్‌గా నిలిచింది. తాంత్రిక పూజల్లో ఆరు పర్వాలు ఉంటాయని, వాటి ద్వారా ఓ యువతిని మాంత్రికుడు బలి ఇవ్వాలని అనుకోవడం ఈ క్రమంలో ఎదురయ్యే ట్విస్ట్‌లతో తంత్ర మూవీ తెరకెక్కింది.
విగతి వర్సెస్ రేఖ…
రేఖ (అనన్య నాగళ్ల) పుట్టుకతోనే తల్లి రాజ్యలక్ష్మికి (సలోని) దూరవుతుంది. నాన్నమ్మ సంరక్షణలో పెరుగుతుంది. క్షుద్ర శక్తుల కారణంగా జన్మించడంతో రేఖ చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతుంటాయి. రేఖకు కనిపిస్తుంటాయి. తనతో పాటే చదువుకుంటున్న క్లాస్‌మేట్ తేజూను (ధనుష్ రఘుముద్రి) ఇష్టపడుతుంది రేఖ. తేజూ వేశ్య కొడుకు కావడంతో వారి ప్రేమకు అనేక అడ్డంకులు ఎదురవుతుంటాయి. పౌర్ణమి వచ్చిందంటే రేఖను వెతుక్కుంటూ ఓ రక్త పిశాచి వస్తుంటుంది.
క్షుద్ర శక్తుల బారి నుంచి రేఖ ఎలా బయటపడింది? అసలు రేఖ నేపథ్యం ఏమిటి? రేఖ తల్లి రాజ్యలక్ష్మి ఎలా చనిపోయింది? రేఖను బలి ఇవ్వాలని విగతి (టెంపర్ వంశీ) ఎందుకు అనుకుంటున్నాడు? అతడి బారి నుంచి రేఖ బయటపడిందా? రేఖను తేజూ కాపాడుకున్నాడా? అన్నదే తంత్ర మూవీ కథ.తంత్ర మూవీకి ఆర్ ఆర్ ధృవన్ మ్యూజిక్ అందించాడు.
పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్…
తెలుగులో సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాలతో సినిమాలు చేస్తోంది అనన్య నాగళ్ల. మల్లేషం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్లేబ్యాక్, అన్వేషి, పొట్టేల్ వంటి చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది.
పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్, నితిన్ మ్యాస్ట్రో సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేసింది. బహిష్కరణ వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు సలోనీ తెలుగులో ఒక ఊరిలో, మర్యాద రామన్న, బాడీగార్డ్, మట్కాతో పాటు మరికొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించింది.
సంబంధిత కథనం