





Best Web Hosting Provider In India 2024

పూరి శిష్యుడితో బిగ్‌బాస్ రన్నరప్ థ్రిల్లర్ మూవీ – రొమాంటిక్ సాంగ్ రిలీజ్
బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా పరమ పద సోపానం పేరుతో ఓ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ నుంచి చిన్ని చిన్ని తప్పులేవో అనే రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పూరి జగన్నాథ్ శిష్యుడు నాగశివ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.
బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి ఓ వైపు సినిమాలు చేస్తూనే టీవీ షోస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్నాడు. ఇటీవలే తెప్పసముద్రం, వెడ్డింగ్ డైరీస్ సినిమాలు చేసిన అర్జున్ అంబటి తాజాగా మరో వైరెటీ థ్రిల్లర్ మూవీతో త్వరలోనే తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.
పరమ పద సోపానం…
అర్జున్ అంబటి హీరోగా పరమపద సోపానం పేరుతో ఓ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. అచ్చ తెలుగు టైటిల్‌తో రూపొందుతోన్న ఈ మూవీలో అర్జున్ అంబటికి జోడీగా జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. పూరి జగన్నాథ్ వద్ద పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాగ శివ….పరమ పద సోపానం మూవీతో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు.
రొమాంటిక్ సాంగ్…
పరమ పద సోపానం మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. చిన్ని చిన్ని తప్పులేవో అనే పల్లవితో సాగిన ఈ పాటకు డేవ్ జాంద్ మ్యూజిక్ అందించాడు. రాంబాబు గోసాల రాసిన ఈ పాటను పృథ్వీ చంద్ర, అదితి బావరాజు ఆలపించారు. ఈ రొమాంటిక్ డ్యూయెట్‌కు అర్జున్ అంబటి, జెన్నిఫర్ ఇమాన్యుయేల్ కెమిస్ట్రీ హైలైట్‌గా నిలుస్తోంది. దేవ్ జాంద్ గతంలో రవితేజ ఈగల్ సినిమాకు మ్యూజిక్ అందించాడు.
జూలైలో రిలీజ్…
జూలై 11న పరమ పద సోపానం మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు డైరెక్షన్‌తో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా నాగ శివ అందిస్తోన్నారు. డిఫరెంట్ థ్రిల్లర్‌గా పరమ పద సోపానం ప్రేక్షకులను మెప్పిస్తోందని నిర్మాత గుడిమిట్ల శివప్రసాద్ అన్నారు. అర్జున్ అంబటికి హీరోగా మంచి పేరు తీసుకొస్తుందని అన్నారు.
టైటిల్ పరమ పద సోపానం అని ఎందుకు పెట్టామన్నది సినిమా చూస్తునే అర్థమవుతుందని పేర్కొన్నారు.
బిగ్‌బాస్ 7 రన్నరప్…
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో ఫైనల్ చేరుకున్న అర్జున్ అంబటి టాఫ్ ఫైవ్ కంటెస్టెంట్‌లో ఒకరిగా నిలిచాడు. తెలుగులో తెప్ప సముద్రంతో పాటు సుందరి, వెడ్డింగ్ డైరీస్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు. హరికథ, అగ్నిసాక్షి వెబ్‌సిరీస్‌లలో అర్జున్ అంబటి డిఫరెంట్ రోల్స్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. బిగ్‌బాస్ బజ్‌తో పాటు పలు టీవీ షోస్‌కు హోస్ట్‌గా ఆకట్టుకున్నాడు.
సంబంధిత కథనం