రేపే తెలంగాణ ఈసెట్ ఫలితాలు, సింపుల్ గా ఇలా చెక్ చేసుకోవచ్చు

Best Web Hosting Provider In India 2024

రేపే తెలంగాణ ఈసెట్ ఫలితాలు, సింపుల్ గా ఇలా చెక్ చేసుకోవచ్చు

Bandaru Satyaprasad HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu

తెలంగాణ ఈసెట్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ఉస్మానియా వర్సిటీలో అధికారులు ఫలితాలను విడుద చేయనునున్నారు.

రేపే తెలంగాణ ఈసెట్ ఫలితాలు, సింపుల్ గా ఇలా చెక్ చేసుకోవచ్చు

తెలంగాణ ఈసెట్ ఫలితాల విడుదలపై అప్డేట్ వచ్చింది. టీజీ ఈసెట్-2025 ఫలితాలు రేపు(మే 25) విడుదల చేయనున్నట్లు…ఈసెట్ కన్వీనర్ పి.చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12.30గంటలకు ఉస్మానియా వర్సిటీలో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ వి.బాలకిష్టారెడ్డి, ఉస్మానియా వర్సిటీ వీసీ కుమార్‌ ఈసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు.

బీఈ, బీటెక్, బీఫార్మసీలో ప్రవేశాలు

రాష్ట్ర వ్యాప్తంగా మే 12న ఈసెట్ పరీక్షను నిర్వహించారు. ఈ ఏడాది కూడా ఈసెట్‌ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించింది. ఈసెట్‌లో అర్హత సాధించిన పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) అభ్యర్థులకు 2025-2026 విద్యా సంవత్సరంలో బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈసెట్ ఫలితాలను https://ecet.tgche.ac.in/ లో తెలుసుకోవచ్చు.

మే 12న ఈసెట్ పరీక్షను నిర్వహించారు. మే 14 నుంచి ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటారు. మే 16 వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించారు. రాష్ట్రంలోని 86 పరీక్ష కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న 19,672 మందికి 18,928 మంది (96.22%) విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

ఈసెట్ అర్హత సాధించడానికి 25% మార్కులు అంటే 200లో 50 మార్కులు రావాలి. అయితే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఈ నిబంధన లేదు. ఈసెట్ ఫలితాల విడుదిల అనంతరం కౌన్సెలింగ్ షెడ్యూల్ వెల్లడించనున్నారు.

తెలంగాణ ఈసెట్-2025 రిజల్ట్స్ డౌన్ లోడ్

  • తెలంగాణ ఈసెట్ ఫలితాలకు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://ecet.tgche.ac.in/ పై క్లిక్ చేయండి.
  • హోంపేజీలో టీజీ ఈసెట్ 2025 రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేయండి.
  • విద్యార్థి హాల్ టికెట్ నెంబర్, ఇతర వివరాలు నమోదు చేయండి.
  • ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. తదుపరి అవసరాలు ఫలితాలను డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.

తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ పాలిసెట్ – 2025 ఫలితాలు విడుదల అయ్యాయి. శనివారం ఉదయం 11 గంటల తర్వాత ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు వారి ర్యాంక్ కార్డులను తెలంగాణ పాలిసెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈనెల 13వ తేదీన పాలిసెట్ – 2025 పరీక్షను నిర్వహించారు. ఈ ఏడాది మొత్తం 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మొత్తం 80,949 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 81.88 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.

ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో అర్హత సాధించిన వారికి పాలిటెక్నిక్‌ కాలేజీల్లోని ఇంజనీరింగ్‌, నాన్ ఇంజనీరింగ్‌, టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు

Bandaru Satyaprasad

TwittereMail
బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Ts EcetExam ResultsEntrance TestsCareerEducationTelangana News
Source / Credits

Best Web Hosting Provider In India 2024