డీఆర్‌డీఓలో 148 పోస్టులు.. అర్హతలు, అప్లై విధానం తెలుసుకోండి!

Best Web Hosting Provider In India 2024


డీఆర్‌డీఓలో 148 పోస్టులు.. అర్హతలు, అప్లై విధానం తెలుసుకోండి!

Anand Sai HT Telugu

డీఆర్‌డీఓ ఆర్‌ఏసీ సైంటిస్ట్ పోస్టులకు అభ్యర్థులను నియమిస్తుంది. అర్హత గల అభ్యర్థులు 148 పోస్టులకు rac.gov.inలో పూర్తి సమాచారం చూడవచ్చు.

డీఆర్‌డీఓలో ఉద్యోగాలు

ీరు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దేశ రక్షణకు తోడ్పడాలనుకుంటే మీ కోసం గుడ్‌న్యూస్ ఉంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) 2025 సంవత్సరానికి సైంటిస్టు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ అవకాశం ఇంజనీరింగ్ పూర్తి చేసి దేశానికి సేవ చేయాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్(డీఆర్‌డీఓ-ఆర్ఏసీ) సైంటిస్ట్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ ఉండనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rac.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

21 రోజుల్లోపు దరఖాస్తు

ఈ నియామక నోటిఫికేషన్ జూన్ మొదటి వారంలో ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రచురించబడే అవకాశం ఉంది. నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుండి 21 రోజుల్లోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద మొత్తం 148 సైంటిస్ట్ పోస్టులు భర్తీ చేస్తారు.

గేట్ స్కోర్

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులను మాత్రమే నియామకానికి అర్హులుగా పరిగణిస్తారు. ఇది కాకుండా వారు గేట్ పరీక్షలో చెల్లుబాటు అయ్యే స్కోరును కూడా కలిగి ఉండాలి.

వయోపరిమితి

వయోపరిమితి గురించి చెప్పాలంటే జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ట వయస్సు 35 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ పరిమితిని ఓబీసీ(నాన్ క్రీమీ లేయర్) కేటగిరీకి 38 సంవత్సరాలు, షెడ్యూల్డ్ కులం/తెగకు 40 సంవత్సరాలుగా నిర్ణయించారు.

దరఖాస్తు ఫీజు

దరఖాస్తు రుసుము జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులు రూ. 100 దరఖాస్తు రుసుము చెల్లించాలి. దీనిని ఆన్‌లైన్‌లో జమ చేస్తారు. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు పూర్తిగా ఉచితం.

ఎంపిక ప్రక్రియ

గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్థులను 1:10 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. గేట్ స్కోరులో 80 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూలో 20 శాతం వెయిటేజీ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్


Best Web Hosting Provider In India 2024


Source link