




Best Web Hosting Provider In India 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం….! ఏపీలో ఈ 3 రోజులు భారీ వర్షాలు
ఏపీలో ఈ 3 రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణం సంస్థ పేర్కొంది. రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్ కు వాతావరణశాఖ వర్ష సూచన ఇచ్చింది. మంగళవారం నాటికి పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అంచనా వేసంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొన్న వివరాల ప్రకారం…. తీరం వెంబడి గంటకు 40-50 కి. మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే ముఖ్యంగా ఉద్యానవన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ఇవాళ అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఏపీలోకి రుతుపవనాలు…!
మరోవైపు నైరుతి రుతుపవనాలు శనివారం కేరళలో ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీ కంటే 8 రోజుల ముందే వచ్చినట్లు ఐఎండీ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఈ రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది.
సంబంధిత కథనం
టాపిక్