




Best Web Hosting Provider In India 2024
జేఈఈ అడ్వాన్స్డ్ 2025పై బిగ్ అప్డేట్- ఆన్సర్ కీ విడుదల ఎప్పుడంటే..
జేఈఈ అడ్వాన్స్డ్ 2025కి సంబంధించిన అభ్యర్థులకు కీలక అలర్ట్! ఆన్సర్ కీ విడుదల డేట్‌ని అధికారులు ప్రకటించారు. ఆన్సర్ కీని jeeadv.ac.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..
2025 మే 22న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ కాన్పూర్) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌ని నిర్వహించింది. అనంతరం, ప్రశ్నపత్రాలు, అభ్యర్థుల సమాధానాలను విడుదల చేసింది. ఇక ఇప్పుడు సంస్థ ఆన్సర్ కీని విడుదల చేయనుంది. జేఈఈ అడ్వాన్స్డ్ ఆన్సర్ కీని అభ్యర్థులు jeeadv.ac.in అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అధికారిక సమాచారం ప్రకారం జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఆన్సర్ కీని మే 26న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
జేఈఈ అడ్వాన్స్డ్ 2025: ముఖ్యమైన తేదీలు..
జేఈఈ అడ్వాన్స్డ్ 2025 వెబ్సైట్లో అందుబాటులో ఉండే అభ్యర్థుల రెస్పాన్స్ షీట్స్ కాపీ: గురువారం, మే 22 (సాయంత్రం 5 గంటలకు)
ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల: సోమవారం, మే 26 (ఉదయం 10 గంటలకు)
ప్రొవిజినల్ ఆన్సర్ కీలపై ఫీడ్‌బ్యాక్ – కామెంట్స్: సోమవారం, మే 26,(ఉదయం 10) నుంచి మంగళవారం, మే 27 (సాయంత్రం 5) వరకు.
జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫైనల్ ఆన్సర్ కీ- ఫలితాల ప్రకటన: సోమవారం, జూన్ 2 (ఉదయం 10 గంటలకు)
ఆర్కిటెక్చర్ యాప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటి) 2025 కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్: సోమవారం, జూన్ 2 (మంగళవారం, 10)
జాయింట్ సీట్ అలాకేషన్ (జేఓఎస్ఏఏ) 2025 ప్రక్రియ ప్రారంభ టెంటెటివ్ డేట్: మంగళవారం, జూన్ 3 (సాయంత్రం 5 గంటలకు)
ఆర్కిటెక్చర్ యాప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) 2025: గురువారం, జూన్ 5 (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు)
ఏఏటీ 2025 ఫలితాల ప్రకటన: జూన్ 8 (ఆదివారం సాయంత్రం 5 గంటలకు)
జేఈఈ అడ్వాన్స్డ్ 2025ను ఐఐటీ కాన్పూర్ రెండు షిఫ్టుల్లో నిర్వహించింది. జేఈఈ అడ్వాన్స్డ్ పేపర్ 1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరిగాయి.
జోన్ల వారీగా అభ్యర్థుల సంఖ్య..
ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు మొత్తం 187223 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు.
ఐఐటీ బాంబే జోన్ : 37002 మంది అభ్యర్థులు
ఐఐటీ దిల్లీ జోన్: 34069 మంది అభ్యర్థులు
ఐఐటీ గౌహతి జోన్: 12802 మంది అభ్యర్థులు
ఐఐటీ హైదరాబాద్ జోన్: 45622 మంది అభ్యర్థులు
ఐఐటీ కాన్పూర్ జోన్: 21019 మంది అభ్యర్థులు
ఐఐటీ ఖరగ్‌పూర్ జోన్: 19302 మంది అభ్యర్థులు
ఐఐటీ రూర్కీ జోన్: 17407 మంది అభ్యర్థులు
అభ్యర్థులు అధికారిక అప్డేట్స్ కోసం జేఈఈ అడ్వాన్స్డ్ వెబ్‌సైట్‌ని క్రమం తప్పకుండా సందర్శించాలి.
దేశంలో ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో చదువు కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్ కోసం ప్రతి యేటా లక్షల సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు. దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఇదొకటి.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link