రెడ్ కార్పెట్‌పై అలియా అందాలు.. సొగ‌సు చూడ‌త‌ర‌మా! కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు వేడుకల్లోస్పెషల్

Best Web Hosting Provider In India 2024

రెడ్ కార్పెట్‌పై అలియా అందాలు.. సొగ‌సు చూడ‌త‌ర‌మా! కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు వేడుకల్లోస్పెషల్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై అలియా భట్ మెరిసింది. తొలి సారి ఈ క్లోజింగ్ ఈవెంట్లో పాల్గొన్న ఈ బాలీవుడ్ భామ చీర కట్టులో తళుక్కుమంది.

రెడ్ కార్పెట్ పై అలియా భట్ (AFP)

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 ముగింపు వేడుకకు హాజరైన అలియా భట్ అందరి చూపు తనపైనే ఉండేలా చూసుకుంది. ఫెస్టివల్ చివరి రోజున రెడ్ కార్పెట్ పై చీరకట్టులో తళుక్కమని మెరిసింది అలియా. క్లోజింగ్ సెరెమనీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఈ భామ. అలియా.. లోరియల్ బ్రాండ్ అంబాసిడర్లలో ఒకరిగా ఉంది.

చీరలో అలియా

భారత సంస్కృతి సంప్ర‌దాయాల‌ను చాటడంతో పాటు చీరకు కాస్త మోడ్రన్ టచ్ కూడా ఇచ్చింది అలియా భట్. రెడ్ కార్పెట్ పై చీరకట్టులో అలియా ఫొటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. నో-ప్లెప్ట్ చీర లుక్ తో పాటు అందుకు సరిపోయే నెక్ లైన్ బ్లౌజ్ తో అదరగొట్టింది అలియా. చీరకట్టులో క్యూట్ లుక్స్ తో అలరించింది భామ.

కేన్స్ లో డెబ్యూ

ఈ ఏడాదే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో డెబ్యూ చేసింది అలియా భట్. మే 23న మాస్టర్ మైండ్ ప్రీమియర్ షోకు ఆమె అటెండ్ అయింది. అప్పుడు లేత గోధుమ రంగు షియాపరెల్లి గౌన్ లో రెడ్ కార్పెట్ పై ముద్దుగా కనిపించింది అలియా. ఆఫ్-షోల్డర్ గౌన్లో క్లిష్టమైన ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ, ఆర్గాంజా వర్క్, ఐవరీ రఫెల్స్ ఉన్నాయి.

ఆ పార్టీలో

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు వెళ్లిన అలియా హాలీవుడ్ కు చెందిన ప్రముఖులతో కలిసి లోరియల్ పార్టీకి హాజరైంది. ఈ సందర్భంగా ఆమె అర్మానీ ప్రివ్ దుస్తులను ఎంచుకుంది. ఆఫ్ షోల్డర్ నంబర్ మెరిసే టాప్ తో పాటు చైన్ మెయిల్ ఆకృతితో ఉన్న డ్రెస్ తో అదరగొట్టింది.

ఒకే ఒక్క మూవీ

ఈ ఏడాది కేన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఒకే ఒక్క ఇండియన్ సినిమా మాత్రమే ప్రదర్శించారు. నీరజ్ డైరెక్ట్ చేసిన హోమ్ బౌండ్ చిత్రం ఫెస్టివల్ లో ప్రదర్శితమైంది. ఇందులో ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్, విశాల్ జెత్వా నటించారు. ఈ చిత్రం ప్రీమియర్ తర్వాత ఫెస్టివల్ లో 9 నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ ను అందుకుంది. ప్రీమియర్ షోలో భావోద్వేగానికి గురైన నీరజ్.. నిర్మాత కరణ్ జోహార్ ను కౌగిలించుకున్నాడు. అయితే ఈ సినిమాకు ఫెస్టివల్ నుంచి అవార్డు రాలేదు.

హాలే బెర్రీ, జెరెమీ స్ట్రాంగ్, హాంగ్ సాంగ్ సో వంటి ప్రపంచ సినిమా దిగ్గజాలతో పాటు భారతీయ ఫిల్మ్ మేకర్ పాయల్ కపాడియా ఈ ఫెస్టివల్ మెయిన్ జ్యూరీలో సభ్యులుగా ఉన్నారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024