





Best Web Hosting Provider In India 2024

ప్రభాస్‌తో త్రిప్తి రొమాన్స్.. ఆర్జీవీ ట్వీట్ వైరల్.. హీరోయిన్ ఏమన్నారంటే?
యానిమల్ మూవీలో బోల్డ్ క్యారెక్టర్ తో సెన్సేషన్ గా మారిన బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేయడమే అందుకు కారణం. దీనిపై ఆర్జీవీ ట్వీట్ వైరల్ గా మారింది.
బాలీవుడ్ హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి పేరు మరోసారి మార్మోగుతోంది. అనూహ్యంగా ఆమె గోల్డెన్ ఛాన్స్ పట్టేసింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ‘స్పిరిట్’ మూవీలో హీరోయిన్ గా త్రిప్తి ఎంపికయ్యారు. ప్రభాస్ పక్కన ఫీమేల్ లీడ్ రోల్ కోసం దీపిక పదుకోణ్ ను సెలెక్ట్ చేస్తారని అంతా అనుకుంటుండగా.. త్రిప్తి పేరు అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు సందీప్. దీనిపై ఫ్యాన్స్ రియాక్షన్స్ వైరల్ గా మారాయి. డైరెక్టర్ ఆర్జీవీ కూడా రియాక్టయ్యారు.
ఆర్జీవీ ఏమన్నారంటే?
ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో త్రిప్తి డిమ్రి ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నారని సందీప్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. ఎక్స్ లోనూ పోస్టు చేశారు. ఈ పోస్టును షేర్ చేస్తూ ఆర్జీవీ చేసిన కామెంట్లు వైరలవుతున్నాయి.
‘‘హే.. సందీప్ రెడ్డి వంగా, యానిమల్ మూవీలో మీరు చూపించిన ఆమె స్క్రీన్ ప్రజెన్స్, పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఆమెను కచ్చితంగా బాలీవుడ్ లో తర్వాతి బిగ్ థింగ్ గా మారుస్తుంది. ప్రస్తుతం ఉన్న బిగ్గీస్ (పెద్ద హీరోయిన్ల) కంటే కూడా. కంగ్రాట్స్ త్రిప్తి. నీ స్పిరిట్ ఆకాశం దిశగా ఎగిరేందుకు ఇదే హై టైమ్’’ అని ఆర్జీవీ పేర్కొన్నారు.
త్రిప్తి రియాక్షన్
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ మూవీలో స్పెషల్ రోల్ లో బోల్డ్ క్యారెక్టర్ చేసిన త్రిప్తి అప్పుడు సెన్సేషన్ గా మారారు. ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ సినిమాతో ఆమెను పాన్ ఇండియా హీరోయిన్ చేయబోతున్నారు సందీప్. త్రిప్తి హీరోయిన్ గా సెలక్ట్ కావడంతో కంగ్రాట్స్ చెప్పిన ఆర్జీవీ పోస్టుకు ఆమె రియాక్టయ్యారు. ‘‘థ్యాంక్యూ సర్.. మీ నుంచి ఇలాంటి కామెంట్ రావడం నాకెంతో విశేషమైంది’’ అని త్రిప్తి కామెంట్ చేశారు.
2017లో డెబ్యూ
2017లో మామ్ సినిమాతో డెబ్యూ చేశారు త్రిప్తి డిమ్రి. ఆ తర్వాత పోస్టర్ బాయ్స్, లైలా మజ్ను, బుల్ బుల్, కాలా, యానిమల్, బ్యాడ్ న్యూజ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో, భూల్ భులనియా 3 సినిమాల్లో నటించారు. యానిమల్ మూవీలో జోయాగా ఆమె క్యారెక్టర్ కు స్పెషల్ గుర్తింపు దక్కింది. రణ్ బీర్ కపూర్ తో ఆమె కెమిస్ట్రీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇప్పుడు ధడక్ 2, అర్జున్ ఉస్తారా సినిమాల్లో చేస్తున్న త్రిప్తి.. ప్రభాస్ స్పిరిట్ లో ఛాన్స్ పట్టేసింది. ఈ మూవీలో తెలుగులోనూ అడుగుపెట్టబోతోంది ఈ ముద్దు గుమ్మ.
సంబంధిత కథనం