Best Web Hosting Provider In India 2024
విజయవాడ: సీఎం వైయస్ జగన్‌కు ఆర్కే అత్యంత సన్నిహితుడని, ఆయన ముఖ్యమంత్రి వెంటే నడుస్తారని వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్, రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేర్కొన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) రాజీనామా అంశంపై వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్, రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి స్పందించారు. పూర్తి వ్యక్తిగత కారణాలతోనే ఆయన రాజీనామా చేసి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన విజయవాడలో మీడియాతో ఈ విషయమై మాట్లాడారు.
సీఎం వైయస్ జగన్‌కు ఆర్కే అత్యంత సన్నిహితుడు. ఆయన వైయస్ జగన్ వెంటే నడుస్తారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా బాగా పని చేశారు. మంగళగిరిని బాగా అభివృద్ధి చేశారు. ఆయనకు అసంతృప్తి అనేది లేదు. రాజకీయాల నుంచి విరమించుకునే ఆలోచనలో ఆర్కే ఉన్నారు. ఎమ్మెల్యే ఆళ్ల అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అవి రీచ్ అవ్వలేకనే రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నారు. అన్నీ ఆలోచించుకునే ఆయన రాజీనామా చేసి ఉంటారని రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. .
మంగళగిరి సీటును బీసీ(పద్మశాలి)లకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. అయినప్పటికీ సీఎం వైయస్ జగన్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా మంగళగిరిలో క్యాడర్‌ను ఆర్కే రూపొందించారు. మళ్లీ మంగళగిరిలో వైయస్ఆర్‌సీపీనే గెలుస్తోంది. పదేళ్లుగా ఎమ్మెల్యేగా పని చేశా అనే సంతృప్తిలో ఆర్కే ఉన్నారు. రాజకీయ సమీకరణాల వల్లే ఆర్కేకు మంత్రి పదవి దక్కలేదని అయోధ్య రామిరెడ్డి చెప్పారు. వ్యక్తిగత పనుల వల్లే ఆర్కే రాజీనామా చేసి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారాయన.