





Best Web Hosting Provider In India 2024

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇవాళ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు.. చూడాల్సిన ది బెస్ట్ 5 ఇవే.. తెలుగులో 4 స్ట్రీమింగ్!
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్‌లో ఇవాళ టాప్ 10 సినిమాలు ఉన్నాయి. వీటిలో చూడాల్సిన ది బెస్ట్ మూవీస్‌గా మాత్రం ఐదు ఉన్నాయి. ఇక వీటిలో నాలుగు సినిమాలు తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. హారర్, హిస్టారికల్ డ్రామా, స్పై యాక్షన్ వంటి జోనర్స్‌తో ఉన్న ఆ ఓటీటీ ట్రెండింగ్ సినిమాలు ఏంటో ఇక్కడ చూద్దాం.
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో దిగ్గజంగా నెట్‌ఫ్లిక్స్ ప్రాధాన్యత సంతరించుకుంది. విభిన్న కంటెంట్‌ను అందించే నెట్‌ఫ్లిక్స్ ఇవాళ ఓటీటీ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలను ప్లాట్‌ఫామ్‌లో చూపించింది. ఇవాళ (మే 25) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ టాప్ 10 సినిమాల్లో చూడాల్సిన ది బెస్ట్ 5 మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ది డిప్లొమాట్ ఓటీటీ
నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 1 స్థానంలో దూసుకుపోతోన్న సినిమా ది డిప్లొమాట్. జాన్ అబ్రహం, సదియా, ప్రాప్తి శుక్లా, షరీబ్ హష్మీ నటించిన ది డిప్లొమాట్ 7.1 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించుకుంది. శివం నాయర్ దర్శకత్వం హించిన ది డిప్లొమాట్ కేవలం హిందీ భాషలోనే నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
జాక్ ఓటీటీ
సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్‌గా నటించి స్పై కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ జాక్. బొమ్మరిల్లు భాస్కర్ చాలా కాలం గ్యాప్ తర్వాత డైరెక్ట్ చేసిన ఈ తెలుగు సినిమా థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కానీ, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో టాప్ 2లో సత్తా చాటుతోంది.
గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. కోలీవుడ్‌లో 200 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు భాషలో అందుబాటులో ఉంది. నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ మూడో స్థానంలో దూసుకుపోతోంది.
మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకనింగ్ పార్ట్ 1 ఓటీటీ
హాలీవుడ్ యాక్షన్ స్టార్ హీరో టామ్ క్రూజ్ నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్ బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్ల కలెక్షన్స్‌తో దుమ్ముదులుపుతోంది. దీంతో ఈ సినిమా మొదటి పార్ట్ అయిన మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకనింగ్ పార్ట్ 1 నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. టాప్ 4లో తెలుగు ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా చూసేందుకు ది బెస్ట్ మూవీ.
ఫియర్ స్ట్రీట్ ప్రొమ్ క్వీన్ ఓటీటీ
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చిన హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ ఫియర్ స్ట్రీట్ ప్రొమ్ క్వీన్. అమ్మాయిలను వెంటాడి చంపే కిల్లర్ ఆధారంగా సాగే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో ఐదో స్థానం దక్కించుకుంది. థ్రిల్లింగ్ సీన్లతో సాగే ఈ సినిమాను చూడటం బెస్ట్.
కోర్ట్ ఓటీటీ
కోర్ట్ రూమ్ డ్రామాగా వచ్చిన కోర్ట్ స్టేట్ వర్సెస్ నో బడీ ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ టాప్ 10 ట్రెండింగ్‌లో స్థానం సంపాదించుకుంది. ఓటీటీలో టాప్ 6 ప్లేస్‌లో కోర్ట్ నిలిచింది. ఎంతోమంది ప్రశంసలు పొందిన ఈ సినిమా చూసేందుకు బెస్ట్.
ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఓటీటీ
క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ప్రియమణి నటించిన ఈ సినిమా టాప్ 7లో దూసుకుపోతోంది. ఆద్యంతం థ్రిల్లింగ్ సీన్స్, ఇన్వెస్టిగేషన్‌తో సాగే ఈ మూవీ తెలుగులో చూసేందుకు బెస్ట్ ఆప్షన్.
జువెల్ థీఫ్ ఓటీటీ
నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన బాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ జువెల్ థీఫ్. సైఫ్ అలీ ఖాన్ యాక్ట్ చేసిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 8 స్థానంలో నిలిచింది.
దేవా ఓటీటీ
షాహిద్ కపూర్, పూజా హెగ్దే నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ దేవా. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పుడో ఓటీటీ రిలీజ్ అయిన ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. ఇవాళ (మే 25) టాప్ 9 ప్లేసులో దేవా ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది.
ఛావా ఓటీటీ
విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన హిందీ హిస్టారికల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం ఛావా ఇప్పటికీ ఓటీటీలో టాప్‌లో దూసుకుపోతోంది. నేడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో టాప్ 10వ స్థానంలో నిలిచింది. తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా చూసేందుకు బెస్ట్ ఆప్షన్.
బెస్ట్ సినిమాలు
ఇలా ఇవాళ (మే 25) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో చూడాల్సిన ది బెస్ట్ మూవీస్‌గా మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకనింగ్ పార్ట్ 1, ఫియర్ స్ట్రీట్ ప్రొమ్ క్వీన్, కోర్ట్, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, ఛావా ఉన్నాయి. వీటిలో ఫియర్ స్ట్రీట్ ప్రొమ్ క్వీన్ తప్పా మిగతా నాలుగు సినిమాలు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
సంబంధిత కథనం