



Best Web Hosting Provider In India 2024

థైరాయిడ్ వల్ల లావుగానో, సన్నగానో అవడం మాత్రమే కాదా? తలనొప్పి కూడా ఒక లక్షణమేనా!
థైరాయిడ్‌ను చాలా మంది సడెన్‌గా లావు అవుతుండటమో, సడెన్‌గా బరువు తగ్గడమో కారణాల రీత్యానే గుర్తిస్తారు. కానీ, థైరాయిడ్ లక్షణాల్లో ఒకటి తలనొప్పి రావడం కూడా. జీవనశైలిలో మార్పులు, మెడిసిన్ తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చో లేదో తెలుసుకుందాం.
థైరాయిడ్ సమస్య ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. వాటిలో ముఖ్యంగా హైపోథైరాయిడిజం (థైరాయిడ్ తక్కువగా పనిచేయడం), హైపర్‌థైరాయిడిజం (థైరాయిడ్ ఎక్కువగా పనిచేయడం) అనేవి చాలా సాధారణం. ఈ సమస్యలతో బాధపడే వారిలో ఎన్నో రకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో ఒకటి తలనొప్పి.
మీ మెడ కింది భాగంలో, సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఒక చిన్న గ్రంథి పేరే థైరాయిడ్ గ్రంథి. ఇది చిన్నదే అయినా, మన శరీరం జీర్ణక్రియను (మెటబాలిజం) నియంత్రించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి సరిగా పనిచేయకపోతే, కేవలం మీ బరువుపైనే కాకుండా, మీ నిద్ర, ఆరోగ్యం మొత్తంపైనా ప్రభావం పడుతుంది. బరువు పెరగడం లేదా తగ్గడం, అలసట, జుట్టు రాలడం వంటివి హైపోథైరాయిడిజం లేదా హైపర్‌థైరాయిడిజం వంటి థైరాయిడ్ సమస్యల సాధారణ లక్షణాలు. అయితే, వీటితో పాటు మీకు తలనొప్పి కూడా రావచ్చు. మరి, ఈ థైరాయిడ్ తలనొప్పి గురించి, దాని నుండి ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకుందాం.
థైరాయిడ్ తలనొప్పి ఎందుకు వస్తుందంటే?
థైరాయిడ్ తలనొప్పి అంటే, థైరాయిడ్ సరిగా పనిచేయకపోవడం వల్ల (ముఖ్యంగా హైపోథైరాయిడిజం వల్ల, కొన్నిసార్లు హైపర్‌థైరాయిడిజం వల్ల కూడా) పదే పదే వచ్చే తలనొప్పి. తలనొప్పి థైరాయిడ్ సమస్యల ముఖ్యమైన లక్షణం కాకపోయినా, హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వల్ల నరాల పనితీరు, రక్తపోటు, వాపులు కారణంగా వచ్చే ఒక లక్షణంగా చెప్పొచ్చని ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ ధీరజ్ కపూర్ అంటున్నారు. అయితే ఈ తలనొప్పి అనేది కొందరిలో కనిపించొచ్చు. మరికొందరిలో అస్సలు రాకపోవచ్చు కూడా.
థైరాయిడ్ తలనొప్పి ఎలా అనిపిస్తుంది?
థైరాయిడ్ తలనొప్పి ఉన్నవారికి తలలో ఒక రకమైన మందమైన ఒత్తిడి లేదా పోటుతో కూడిన నొప్పి అనిపించవచ్చు. ఇది అరగంట పాటు ఉండవచ్చు లేదా కొన్ని రోజుల పాటు కొనసాగవచ్చు. “హైపోథైరాయిడిజంలో, ఇది ఎక్కువగా టెన్షన్ తలనొప్పిలా అనిపిస్తుంది. హైపర్‌థైరాయిడిజంలో, ఇది మరింత తీవ్రంగా లేదా మైగ్రేన్ లాగా అనిపించవచ్చు. నాడీ వ్యవస్థ అధికంగా ఉత్తేజితం కావడం వల్ల తరచుగా ఆందోళన, గుండె దడ, లేదా కాంతిని చూడలేకపోవడం వంటివి కూడా ఉండవచ్చు.
తలనొప్పిని పెంచే థైరాయిడ్ సమస్యలు
హైపోథైరాయిడిజం, హైపర్‌థైరాయిడిజం అనేవి తలనొప్పికి కారణమయ్యే సాధారణ థైరాయిడ్ సమస్యలు.
హైపోథైరాయిడిజం: ఇది తరచుగా అలసట, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలతో ముడిపడి ఉంటుంది. కానీ థైరాయిడ్ తలనొప్పి కూడా రావచ్చు. థైరాయిడ్ హార్మోన్ల స్థాయిలు తగ్గడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది కొన్నిసార్లు తలనొప్పికి కారణం కావచ్చు. రక్త ప్రవాహంలో మార్పులు లేదా థైరాయిడ్ సరిగా పనిచేయని స్థితి వల్ల నరాల పనితీరు దెబ్బతిని హైపోథైరాయిడిజం రావొచ్చు.
హైపర్‌థైరాయిడిజం: నరాల బలహీనత, ఆందోళన, నిద్ర సమస్యలతో ఎక్కువగా సంబంధం ఉన్న ఈ సమస్య కూడా తలనొప్పికి కారణం కావచ్చు. థైరాయిడ్ అతి చురుకుగా ఉండటం, నాడీ వ్యవస్థ అధికంగా పనిచేయడం కూడా తలనొప్పికి దారితీస్తుంది.
మైగ్రేన్, థైరాయిడ్ తలనొప్పి
మైగ్రేన్ అనేది వికారం, మూడ్ మార్పులు, అలసట వంటి లక్షణాలతో కూడిన ఒక రకమైన తలనొప్పి. దీనిలో తల ఒక వైపున పోటుతో కూడిన నొప్పి వస్తుంది. థైరాయిడ్ సమస్యల వల్ల కలిగే హార్మోన్ల అసమతుల్యత మెదడు రసాయనాల ద్వారా నొప్పిని గ్రహించే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. ఇవన్నీ మైగ్రేన్ రావడానికి కారణం కావచ్చు.
థైరాయిడ్ తలనొప్పిని ఎలా తగ్గించుకోవాలి?
థైరాయిడ్ తలనొప్పిని ప్రత్యేకంగా తగ్గించుకోవడం కంటే, దానికి కారణమైన థైరాయిడ్ సమస్యను నయం చేసుకోవడం ముఖ్యం. తలనొప్పిగా అనిపించిన వెంటనే అన్ని పనులు పక్కన పెట్టి, నిశ్శబ్దంగా, చీకటి గదిలో పడుకోండి. ఇది కొంత ఉపశమనాన్ని ఇస్తుంది. తరచుగా మసాజ్‌లు చేయించుకోవడం, డాక్టర్ ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడటం, జీవనశైలి మార్పులు పాటించడం, హార్మోన్ల స్థాయిలను తెలుసుకోవడానికి రెగ్యులర్‌గా చెకప్‌లకు వెళ్లడం వల్ల థైరాయిడ్‌ను స్థిరీకరించుకోవచ్చు.
వీటితో పాటుగా అదనంగా ఈ జాగ్రత్తలు పాటించాలి.
ఆరోగ్యకరమైన ఆహారం తినండి: గుడ్లు, పాల ఉత్పత్తులు, ట్యూనా (చేప), అయోడిన్ కలిపిన ఉప్పు వంటివి తీసుకోవాలి.
ఒత్తిడిని తగ్గించుకోండి: యోగా, మెడిటేషన్, డైరీ రాయడం, సంగీతం వినడం, లోతైన శ్వాస వ్యాయామాలు, తేలికపాటి వ్యాయామం వంటి ఒత్తిడిని తగ్గించే పద్ధతులను పాటించి ఒత్తిడి లక్షణాలను తగ్గించుకోవచ్చు.
మైగ్రేన్ ట్రిగ్గర్లను తగ్గించుకోండి: మీకు మైగ్రేన్, థైరాయిడ్ సమస్య రెండూ ఉంటే, ఒత్తిడి, నిద్రలేమి, డీహైడ్రేషన్ వంటి సాధారణ మైగ్రేన్ ట్రిగ్గర్లను (మైగ్రేన్‌ను పెంచేవి) నివారించండి.