ఓటీటీలోకి ఐదు భాషల్లో రానున్న మలయాళ సూపర్ హిట్ చిత్రం: వివరాలివే

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి ఐదు భాషల్లో రానున్న మలయాళ సూపర్ హిట్ చిత్రం: వివరాలివే

అలప్పుజ జింఖానా చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. థియేటర్లలో మంచి హిట్ అయిన ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ఐదు భాషల్లో అందుబాటులోకి రానుంది.

ఓటీటీలోకి ఐదు భాషల్లో రానున్న మలయాళ సూపర్ హిట్ చిత్రం:  వివరాలివే

ప్రేమలు ఫేమ్ నెస్లన్ గఫూర్ ప్రధాన పాత్ర పోషించిన అలప్పుజ జింఖానా చిత్రం ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ మలయాళ స్పోర్ట్ కామెడీ డ్రామా మూవీకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీని తెలుగులోనూ ఏప్రిల్ 25న మేకర్స్ విడుదల చేశారు. ఈ అలప్పుజ జింఖానా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు.

అలప్పుజ జింఖానా మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‍‍పై సమాచారం బయటికి వచ్చింది. స్ట్రీమింగ్ డేట్‍పై బజ్ నడుస్తోంది. ఐదు భాషల్లో ఈ చిత్రం ఎంట్రీ ఇవ్వనుంది.

స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

అలప్పుజ జింఖానా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం జూన్ 5వ తేదీన సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. ఈ సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్ట్రీమింగ్ డేట్‍పై ఓటీటీ ప్లాట్‍ఫామ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఐదు భాషల్లో..

అలప్పుజ జింఖానా సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో అందుబాటులోకి వస్తుంది. మంచి క్రేజ్ ఉండటంతో ఓటీటీలోనూ ఈ మూవీ సత్తాచాటే ఛాన్స్ ఉంది.

బాక్సింగ్ బ్యాక్‍డ్రాప్‍‌లో..

అలప్పుజ జింఖానా చిత్రానికి ఖాలిద్ రహమాన్ దర్శకత్వం వహించారు. కొందరు కాలేజీ ఫ్రెండ్స్ బాక్సింగ్ నేర్చుకుందామని నిర్ణయిచుకోవడం, ముందు సరదాగా తీసుకున్నా ఆ తర్వాత తీవ్రంగా ప్రాక్టీస్ చేసి ముందుకు సాగడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. కామెడీ, ఎనర్జీ, కొన్ని చోట్ల సీరియస్‍నెస్‍తో ఈ మూవీ సాగుతుంది.

అలప్పుజ జింఖానా మూవీలో నెస్లెన్‍తో పాటు ల్యూక్‍మన్ అవరన్, గణపతి, సందీప్ ప్రదీప్, హబీశ్, ఫ్రాకో ఫ్రాన్సిస్, శివ హరిహరణ్, విశ్వజీత్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి విష్ణు విజయ్ సంగీతం అందించారు.

అలప్పుజ జింఖానా కలెక్షన్లు

అలప్పుజ జింఖానా చిత్రం సుమారు రూ.12కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఈ సినిమా ఓవరాల్‍గా రూ.56కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అయింది. తెలుగులోనూ ఈ చిత్రం మంచి కలెక్షన్లనే సొంతం చేసుకుంది. ఈ మూవీని ప్లాన్ బీ మోషన్ పిక్చర్స్, రీలిస్టిక్ స్టూడియోస్ బ్యానర్లపై డైరెక్టర్ ఖాలిద్ రహమాన్, జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సుబీశ్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీకి జిమ్షి ఖాలిద్ సినిమాటోగ్రఫీ చేయగా.. నిషాద్ యూసుఫ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024