





Best Web Hosting Provider In India 2024

వాట్సాప్ లో 8 రకాల రేషన్ కార్డుల సేవలు, దరఖాస్తు ప్రక్రియ ఇలా
ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు సేవలను వాట్సాప్ గవర్నెన్స్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 8 రకాల రేషన్ కార్డు సేవలను మన మిత్రలో అందుబాటులో ఉంచింది. దీపం పథకంతో పాటు రేషన్ కార్డులో సభ్యుల జోడింపు, తొలగింపు, ఈకేవైసీ, కార్డు విభజన వంటి సేవలు మన మిత్రలో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియను మరింత సులభతరం చేసింది. వాట్సాప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’లో రేషన్ కార్డుల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది.
మొత్తం ఎనిమిది రకాల పౌరసరఫరాల శాఖ సేవలు మన మిత్ర (9552300009)లో అందుబాటులోకి వచ్చాయి.
వాట్సాప్ లో అందుబాటులో ఉన్న సివిల్ సప్లై సేవలు
- దీపం పథకం స్థితి(ఉచిత సిలిండర్ రాయితీ)
- రైస్ డ్రా స్థితి(రేషన్ ఎక్కడ తీసుకున్నారు)
- రైస్ కార్డు ఈకేవైసీ
- రైస్ కార్డు సరెండర్
- రేషన్ కార్డులో సభ్యులను జోడించడం
- రేషన్ కార్డులో సభ్యులను తొలగించడం
- తప్పుగా జోడించిన ఆధార్ సీడింగ్ సవరణ
రేషన్ కార్డు సేవలు
రాష్ట్రంలో ప్రస్తుతం 1.46 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. మే 7 నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీంతో పాటు రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. ఐదేళ్ల కంటే తక్కువ వయసు పిల్లలు, 80 ఏళ్లు పైబడిన వారికి ఈ కేవైసీ నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తైన వారికి స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. అలాగే 50 ఏళ్లు పైబడిన అవివాహితులు, విడాకులు తీసుకున్నవారు, అనాథాశ్రమాల్లో నివసించేవారు, ట్రాన్స్ జెండర్లకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు.
వాట్సాప్ మన మిత్రలో రేషన్ కార్డు సేవల ప్రక్రియ
- వాట్సాప్ లో ఏపీ ప్రభుత్వం మన మిత్ర నెంబర్ 9552300009 కు Hi అని మెసేజ్ చేయండి
- ‘సేవను ఎంచుకోండి’ అనే ఆప్షన్ లో సివిల్ సప్లైస్ సేవలపై క్లిక్ చేయండి.
- ఇందులో ‘దీపం స్థితి, రైస్ డ్రా, ఈ కేవైసీ, రైస్ కార్డు సమర్పణ, రేషన్ కార్డులో సభ్యుల జోడింపు, తొలగింపు, ఆధార్ సీడింగ్, రేషన్ కార్డు విభజన వంటి 8 రకాల సేవలు కనిపిస్తాయి.
- వీటిలో మీకు అవసరమైన సేవలను ఎంచుకోండి.
- అనంతరం ఆధార్ నెంబర్ నమోదు చేసి ఓటీపీ ద్వారా నిర్థారణ చేయండి.
- ప్రాథమిక సమాచారంలో సభ్యుల వివరాలు, చిరునామా నమోదు చేయండి.
- రేషన్ కార్డులో మీకు కావాల్సిన సేవలకు అప్లై చేసుకోవచ్చు.
- అప్డేట్ అయిన రైస్ కార్డును వాట్సాప్ లోనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
వాట్సాప్ సేవల్లో కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడంతో కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించాలి.
సంబంధిత కథనం
టాపిక్