



Best Web Hosting Provider In India 2024
కొచ్చి తీరంలో మునిగిన భారీ నౌక.. అందులో ప్రమాదకర రసాయనాలు!
కేరళలోని కొచ్చి తీరంలో సరుకు రవాణా నౌక మునిగిపోయింది. ఈ ప్రమాదంలో చాలా కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. అందులో రసాయనాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
ేరళలోని సముద్ర తీరానికి సమీపంలో లైబీరియాకు చెందిన పెద్ద నౌక సముద్రంలో పూర్తిగా మునిగింది. ఇక్కడ లైబీరియన్ కార్గో షిప్ అకస్మాత్తుగా తీరం నుండి 38 నాటికల్ మైళ్ల దూరంలో వంగిపోయింది. మెల్లమెల్లగా మెుత్తం మునిగిపోయింది. దీని కారణంగా ఓడలో లోడ్ చేసిన అనేక కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. ఇందులో వందల కంటైనర్లు ఉన్నాయి. వాటిలో 13 కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు, 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్, మిగిలిన వాటిలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్టుగా ఇండియన్ కోస్డ్ గార్డ్ తెలిపింది.
దీనితో పర్యావరణ నష్టం ప్రమాదం ఎక్కువే జరుగుతుంది. లీకైతే సముద్ర జలాలు తీవ్రంగా కలుషితమయ్యే అవకాశం ఉంది. దీంతో అధికారులు కొచ్చి తీరంలో హైఅలర్ట్ ప్రకటించారు. ఆయిల్ ఎంతమేరకు లీక్ అయిందనే దాని గురించి పరిశీలిస్తున్నారు. ఒకవేళ సమస్య ఎక్కువైతే ఏం చేయాలని ముందస్తు ప్రణాళికలు వేస్తున్నారు అధికారులు.
శనివారం ఈ భారీ నౌక ఒరిగిపోయింది. ఆ తర్వాత మెల్ల మెల్లగా మునగడం మెుదలైంది. భారత నావికాదళం, కోస్ట్ గార్డ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యను ప్రారంభించాయి. ఓడలో ఉన్న 24 మందిని సురక్షితంగా రక్షించారు. ఓడలోని 24 మంది సిబ్బందిలో ఒక రష్యన్(కెప్టెన్), 20 మంది ఫిలిప్పీన్స్, ఇద్దరు ఉక్రేనియన్లు, ఒక జార్జియన్ జాతీయుడు ఉన్నారు. ఆ నౌకలో మెరైన్ గ్యాస్ ఆయిల్, ఇంధన నూనె ఉన్నట్లు కోస్ట్ గార్డ్ నిర్ధారించింది.
ఆదివారం ఉదయం ఈ సంఘటన గురించి సమాచారం బయటకు వచ్చింది. కొన్ని కంటైనర్లు నీటిలో పడిపోయాయని, నీటిలో నౌగ మునిగిపోయిందని అధికారులు చెప్పారు. ఈ సంఘటన కారణంగా పర్యావరణ నష్టం జరిగే ప్రమాదం పెరుగుతోంది.
ఒడ్డుకు వచ్చే అవకాశం ఉన్న ఏ కంటైనర్, చమురును తాకవద్దని కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ(KSDMA) ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఒడ్డున కంటైనర్లు లేదా చమురు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరింది.
టాపిక్
Best Web Hosting Provider In India 2024
Source link