




Best Web Hosting Provider In India 2024

హరి హర వీరమల్లు ట్రైలర్ ఎప్పుడు! డైరెక్టర్ ఏం చెప్పారంటే..
హరి హర వీరమల్లు సినిమా ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ట్రైలర్ ఆలస్యమవుతోంది. ఈ తరుణంలో ఈ విషయంపై డైరెక్టర్ జ్యోతి కృష్ణ స్పందించారు. ట్రైలర్ ప్లాన్ గురించి వెల్లడించారు.
హరి హర వీరమల్లు సినిమాకు క్రేజ్ ఓ రేంజ్లో ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ పీరియడ్ యాక్షన్ మూవీ జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది. ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పకున్నాక ఈ చిత్రానికి ఎస్ఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ కోసం చాలా మంది ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై డైరెక్టర్ జ్యోతికృష్ణ స్పందించారు.
ట్రైలర్ ఎప్పుడంటే.. నార్త్‌లో ఈవెంట్
హరి హర వీరమల్లు గురించి డైరెక్టర్ జ్యోతికృష్ణ.. ఎక్స్ (ట్విట్టర్)లో నెటిజన్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. చాలా మంది ట్రైలర్ ఎప్పుడంటూ అడిగారు. దీనికి జ్యోతికృష్ణ రెస్పాండ్ అయ్యారు. జూన్ తొలి వారంలో హరి హర వీరమల్లు ట్రైలర్ వస్తుందని తెలిపారు. ట్రైలర్ లాంచ్ కోస నార్త్ఇండియాలో ఓ ఈవెంట్ నిర్వహించనున్నట్టు తెలిపారు.
ట్రైలర్ ఆలస్యానికి కారణమిదే!
హరి హర వీరమల్లు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ట్రైలర్ కోసం ఇంకా పవన్ కల్యాణ్ డబ్బింగ్ చెప్పాల్సింది. ఈ కారణాలతో ట్రైలర్ ఆలస్యమవుతోంది. జూన్ ఫస్ట్ వీక్‌లో తీసుకొస్తామని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేశారు. కాగా, మే 28వ తేదీన మరో పాటను రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ సిద్ధమైంది.
ప్రమోషన్లు భారీగా..
హరి హర వీరమల్లు సినిమా కోసం ప్రమోషన్లు భారీగా చేయాలని మూవీ టీమ్ భావిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రిలీజ్ అవుతున్న ఆయన ఫస్ట్ సినిమా కావడంతో హైప్ కూడా ఓ రేంజ్లో ఉండనుంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించాలని యూనిట్ ప్లాన్ చేసింది. తిరుపతిలోనూ ఓ భారీ ఈవెంట్ ఉండనుందని తెలుస్తోంది. చెన్నైలో ఓ సాంగ్ లాంచ్ ఉండనుంది. ఇలా పాన్ ఇండియా రేంజ్లో జోరుగా ప్రమోషన్లు చేయాలని భావిస్తోంది. జూన్ 12న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు టీమ్ రెడీ అయింది.
హరి హర వీరమల్లు సినిమా మొఘలుల కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. మొఘలులకు సవాల్ విసిరే యోధుడు వీరమల్లు పాత్ర చేశారు పవన్. కోహినూర్ వజ్రం చుట్టూ స్టోరీ సాగుతుంది. ఈ చిత్రం 2020లోనే మొదలైన రకరకాల కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నారు. జ్యోతికృష్ణ గతేడాది దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే పెండింగ్ షూటింగ్‌ను పవన్ పూర్తి చేశారు.
హరి హర వీరమల్లు చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మూడు పాటలు వచ్చాయి. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్ రోల్ చేశారు. ఔరంజేబు పాత్రలో బాబీ డియోల్ నటించారు. సత్యరాజ్, నర్గీస్ ఫక్రీ, విక్రమ్‌జీత్ విర్క్, నాజర్, నోరా ఫతేహి కీరోల్స్ చేశారు. ఈ మూవీని దాయకర్ రావు నిర్మించగా.. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం సమర్పిస్తున్నారు.
సంబంధిత కథనం