




Best Web Hosting Provider In India 2024

ఓటీటీలో గ్లోబల్ రేంజ్‍లో ట్రెండ్ అవుతున్న థ్రిల్లర్ చిత్రం.. యథార్థ ఘటనలతో తెరకెక్కిన మూవీ.. మీరు చూశారా!
ది డిప్లొమాట్ చిత్రం ఓటీటీలో అదరగొడుతోంది. భారీ వ్యూస్ సాధిస్తోంది. ఇప్పుడు ఏకంగా గ్లోబల్ రేంజ్‍లో ట్రెండ్ అవుతోంది. ఈ సూపర్ హిట్ మూవీ వివరాలివే..
ది డిప్లొమాట్ చిత్రం మార్చి 14వ తేదీన థియేటర్లలో రిలీజై మంచి హిట్ సాధించింది. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు జాన్ అబ్రహాం ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూవీ థియేట్రికల్ రన్‍తో సక్సెస్ అయింది. ఇప్పుడు ఓటీటీలోనూ ది డిప్లొమాట్ అదరగొడుతోంది.
గ్లోబల్ రేంజ్‍లో ట్రెండింగ్
ది డిప్లొమాట్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో భారీ వ్యూస్ సాధిస్తోంది. మే 9వ తేదీన ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. స్ట్రీమింగ్ తర్వాత కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. దీంతో వ్యూస్ కూడా క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో ది డిప్లొమాట్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ నాన్-ఇంగ్లిష్ సినిమాల లిస్టులో గ్లోబల్ రేంజ్‍లో ట్రెండ్ అవుతోంది.
నెట్‍ఫ్లిక్స్ నాన్ ఇంగ్లిష్ సినిమాల గ్లోబల్ ట్రెండింగ్ లిస్టులో ప్రస్తుతం (మే 25) నాలుగో స్థానానికి ది డిప్లొమాట్ దూసుకొచ్చింది. 18 దేశాల్లో ఈ చిత్రం ప్రస్తుతం టాప్-10లో ట్రెండ్ అవుతోంది. ఇండియాతో పాటు మరో ఏడు దేశాల ట్రెండింగ్‍లో టాప్‍లో ఉంది.
నిజజీవిత ఘటనల ఆధారంగా..
పాకిస్థాన్‍లోని హైకమిషన్‍లో భారత దౌత్యవేత్తగా బాధ్యతలు నిర్వర్తించిన జేపీ సింగ్ నిజ జీవితంలోని ఘటనల ఆధారంగా ది డిప్లొమాట్ సినిమా తెరకెక్కింది. పాకిస్థాన్‍లో చిక్కుకున్న ఓ భారత మహిళను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాల చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. ఈ సినిమాకు శివమ్ నాయర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో జేపీ సింగ్ పాత్ర పోషించారు జాన్ అబ్రహాం.
కమర్షియల్ హిట్
ది డిప్లొమాట్ చిత్రం మంచి ప్రశంసలు దక్కించుకుంది. దీంతో పాటు కమర్షియల్‍గానూ హిట్ సాధించింది. రూ.20కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ సినిమా సుమారు రూ.53కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ సక్సెస్ సాధించింది.
ది డిప్లొమాట్ మూవీలో భారత దౌత్యవేత్త జేపీ సింగ్ పాత్రను జాన్ అబ్రహాం చేయగా.. పాకిస్థాన్‍లో చిక్కుకున్న ఉజ్మా అహ్మద్‍గా షాహిదా ఖతీబ్ నటించారు.షరీబ్ హష్మి, కుముద్ మిశ్రా, రేవతి, అశ్వత్ భట్, బెంజిమన్ గిలానీ కీలకపాత్రలు పోషించారు. టీ సిరీస్ ఫిల్మ్స్, జేఏ ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ పిక్చర్స్ బ్యానర్లు ఈ మూవీని నిర్మించాయి.
సంబంధిత కథనం