





Best Web Hosting Provider In India 2024

సంగారెడ్డి మహిళలు స్కై వారియర్స్, మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రశంసలు
ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో సంగారెడ్డి మహిళలను ప్రశంసించారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగిస్తున్న మహిళలను స్కై వారియర్స్ గా సంబోధించారు. డ్రోన్ల వినియోగం వల్ల కూలీల కొరతను అధిగమించొచ్చని ప్రధాని మోదీ సూచించారు.
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు మహిళలు డ్రోన్ల ద్వారా వ్యవసాయం చేస్తూ ‘డ్రోన్ దీదీ’లుగా ప్రసిద్ధి చెందారు. వీరి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. మహిళలను ‘స్కై వారియర్స్’గా సంబోధించారు. ప్రధాని మోదీ తమ గురించి మాట్లాడడంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు.
వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం
సంగారెడ్డి జిల్లా మహిళల గురించి ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంతో సమయం, డబ్బు ఆదా చేస్తున్నారని మహిళలను మోదీ ప్రశంసించారు.
సంగారెడ్డి మహిళలు డ్రోన్లను సమర్థవంతంగా వినియోగిస్తున్నారు, మిగతా ప్రాంతాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని సూచించారు. వ్యవసాయరంగంలో డ్రోన్ల వినియోగం వల్ల కూలీల కొరతను అధిగమించొచ్చని ప్రధాని మోదీ సూచించారు.
నారీ శక్తికి ఉదాహరణగా తెలంగాణ మహిళలు
మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతినుద్దేశించి ప్రధాని మోదీ గ్రామీణ భారతంలో అద్భుతమైన మహిళా సాధికారతకు ఉదాహరణగా నిలిచిన తెలంగాణలోని సంగారెడ్డి మహిళలను ప్రశంసించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
స్కై వారియర్స్
ఒకప్పుడు వ్యవసాయ పనులకు ఇతరులపై ఆధారపడిన మహిళలు ఇప్పుడు సొంతగా డ్రోన్ల ద్వారా సాగు చేస్తూ “స్కై వారియర్స్”గా మారారన్నారు. 50 ఎకరాలకు పైగా సాగు చేస్తున్న పంట పొలాల్లో పురుగు మందులను పిచికారీ చేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారని చెప్పారు.
దీనివల్ల వారు తీవ్రమైన ఎండ, విషపూరిత రసాయనాల బారిన పడే ప్రమాదం తగ్గడంతో పాటు పని సమర్థత పెరిగిందని చెప్పారు.
ఈ మార్పు నూతన సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా నారీ శక్తిని శక్తివంతం చేయడంలో మోదీ ప్రభుత్వం చూపిస్తున్న అంకితభావానికి నిదర్శనంగా నిలిచిందని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ మహిళలను చూసి గర్విస్తున్నానని ఎక్స్ లో పోస్టు పెట్టారు.
సంబంధిత కథనం
టాపిక్