





Best Web Hosting Provider In India 2024

ఎనిమిది వారాలకు ఓటీటీలోకి రూ.120కోట్ల యాక్షన్ సినిమా! స్ట్రీమింగ్ ఎక్కడ?
జాట్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాలను స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుందని తెలుస్తోంది. ఈ చిత్రం ఎప్పుడు ఓటీటీలోకి రావొచ్చంటే..
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ నటించిన ‘జాట్’ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో విడుదలైంది. తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ మూవీతో బాలీవుడ్‍లోకి ఎంట్రీ ఇచ్చారు. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లను దక్కించుకుంది. ఇక జాట్ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‍కు సమీపిస్తోంది.
స్ట్రీమింగ్ డేట్ ఇదేనా!
జాట్ చిత్రం జూన్ 5వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ స్ట్రీమింగ్‍కు రానుందనే అంచనాలు వెలువడుతున్నాయి. థియేటర్లలో రిలీజైన ఎనిమిది వారాలకు స్ట్రీమింగ్‍కు తెచ్చేలా మేకర్లతో నెట్‍ఫ్లిక్స్ డీల్ చేసుకుందని తెలుస్తోంది. దీంతో జూన్ 5న స్ట్రీమింగ్‍కు వస్తుందని సమాచారం. నెట్‍ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తెలుగు నిర్మాతలు.. కలెక్షన్లు ఇలా
జాట్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై తెలుగు నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూజ్ చేశారు. జీ స్టూడియోస్ కూడా నిర్మాణంలో భాగమైంది. సుమారు రూ.100కోట్ల బడ్జెట్‍తో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం ఓవరాల్‍గా దాదాపు రూ.120కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద మోస్తరు రిజల్ట్ అందుకుంది.
జాట్ మూవీలో బల్‍దేవ్ ప్రతాప్ సింగ్ అనే పవర్‌ఫుల్ రోల్ చేశారు సన్నీ డియోల్. విలన్‍గా రణ్‍దీప్ హుడా నటించారు. రెజీనా కసాండ్రా, జగపతి బాబు, రమ్యకృష్ణ, రవిశంకర్, ఉపేంద్ర, సయామీ ఖేర్, జెరీనా వాహబ్, వినీత్ కుమార్, స్వరూప ఘోష్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.
బాలయ్య నో చెప్పడంతో బాలీవుడ్‍కు..
జాట్ సినిమాను స్టోరీని ముందుగా టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణకు చెప్పారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. అయితే, ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో నో చెప్పారు బాలయ్య. దీంతో బాలీవుడ్‍లో సన్నీ డియోల్ హీరోగా తెరకెక్కించారు మలినేని.
జాట్ స్టోరీలైన్
శ్రీలంక నుంచి ఆంధ్రప్రదేశ్‍లోని మోతుపల్లి అనే ఓ గ్రామానికి వస్తాడు క్రిమినల్ రణతుంగ (రణ్‍దీప్ హుడా). ఆ ప్రాంతంలో సోదరులతో కలిసి అతడు అరాచకాలకు పాల్పడుతుంటాడు. గ్రామస్తులను కష్టాలు పెడుతుంటాడు. ఆ గ్రామానికి బల్‍దేవ్ ప్రతాప్ సింగ్ (సన్నీ డియోల్) వస్తాడు. రణతుంగ, అతడి సోదరులకు వ్యతిరేకంగా పోరాడతాడు. పోరు తీవ్రమవుతుంది. అసలు ఈ బల్‍దేవ్ ఎవరు? రణతుంగపై ఎందుకు పోరుకు దిగుతాడు? ఇద్దరి గతమేంటి? చివరికి ఏం జరిగింది? అనే అంశాలు జాట్ చిత్రంలో ఉంటాయి.
సంబంధిత కథనం