




Best Web Hosting Provider In India 2024

చైల్డ్ ఆర్టిస్ట్‌గా 70 సినిమాలు చేశాను.. హీరోగా ఇదే నా మొదటి మూవీ.. నిఖిల్ దేవాదుల కామెంట్స్
బాల నటుడిగా పలు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ దేవాదుల హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ఘటికాచలం. హారర్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమాకు అమర్ కామెపల్లి దర్శకత్వం వహించారు. రీసెంట్‌గా జరిగిన ఘటికాచలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో నిఖిల్ దేవాదుల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
తెలుగులో అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన నిఖిల్ దేవాదుల హీరోగా నటించిన సినిమా “ఘటికాచలం”. ఈ చిత్రానికి కథను అందిస్తూ ఒయాసిస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ ఎం.సి. రాజు నిర్మించారు. “ఘటికాచలం” చిత్రాన్ని ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందించారు దర్శకుడు అమర్ కామెపల్లి.
ఘటికాచలం ట్రైలర్ లాంచ్
ఈ ఘటికాచలం సినిమాను మాస్ మూవీ మేకర్స్‌పై ప్రముఖ దర్శకుడు మారుతి, సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల అంటే మే 31న ఘటికాచలం సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఘటికాచలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోగా ఎంట్రీ ఇస్తోన్ననిఖిల్ దేవాదుల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
హీరోగా మొదటి మూవీ
హీరో నిఖిల్ దేవాదుల మాట్లాడుతూ.. “నేను చైల్డ్ ఆర్టిస్టుగా 70 సినిమాల వరకు చేశాను. ఇది హీరోగా నా మొదటి మూవీ. చాలా ఎఫర్ట్స్ పెట్టి ఘటికాచలం సినిమాకు వర్క్ చేశాం. టెక్నికల్‌గా, స్క్రిప్ట్ పరంగా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం” అని అన్నాడు.
పర్‌ఫెక్ట్ షాట్ వచ్చేవరకు
“ఈ క్యారెక్టర్ నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. తను ఒక్కో మూడ్‌ను బట్టి ఒక్కోలా బిహేవ్ చేస్తుంటాడు. షాట్ పర్‌ఫెక్ట్‌గా వచ్చేవరకు మా డైరెక్టర్ గారు కాంప్రమైజ్ కాలేదు. ఈ క్యారెక్టర్‌లో పర్‌ఫార్మెన్స్ చూసుకున్నాక సంతృప్తిగా అనిపించింది. మా మూవీ టీజర్‌ను లైక్ చేశారు. ఇప్పుడు ట్రైలర్ కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం” అని నిఖిల్ దేవాదుల తెలిపాడు.
ఏం చేసిన వాళ్లకోసమే
“ఘటికాచలం చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న ఎస్‌కేఎన్ గారికి, మారుతి గారికి థ్యాంక్స్. నాతో పాటు వర్క్ చేసిన కో ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్స్. నా, ఫ్రెండ్స్, మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. నేనేం చేసినా వాళ్ల కోసమే. ఘటికాచలం సినిమాను ఈ నెల 31న థియేటర్స్‌లో చూసి సపోర్ట్ చేయాలని కోరుతున్నా” అని హీరో నిఖిల్ దేవాదుల తన స్పీచ్ ముగించాడు.
కంటెంట్ బాగున్న చిత్రాలను
ఇదే ఈవెంట్‌లో నటుడు జోగి నాయుడు మాట్లాడుతూ.. “ఘటికాచలం మంచి కంటెంట్ ఉన్న సినిమా. కంటెంట్ బాగున్న చిత్రాలను తెలుగు ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు. ఈ చిత్రంలో నేనొక చిన్న రోల్ చేశాను. పాత్ర చిన్నదైనా నాకు మంచి గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నా. ఈ నెల 31న థియేట్రికల్ రిలీజ్‌కు వస్తున్న ఘటికాచలం చిత్రాన్ని మీరంతా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా” అని అన్నారు.
నాలుగో తెలుగు సినిమా
“తెలుగులో నేను చేసిన నాలుగవ చిత్రమిది. ఆఫీసర్, ఓమ్ బీమ్ భుష్, తండేల్ చిత్రాల్లో నన్ను తెలుగు ఆడియెన్స్ ఆదరించారు. ఘటికాచలం సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అమర్ గారికి థ్యాంక్స్” అని యాక్టర్ షాన్ తెలిపారు.
సంబంధిత కథనం