జుట్టు సహజంగా మెరవాలన్నా, పొడవుగా పెరగాలన్నా ఇంట్లో ఈ మందార మెంతుల హెయిర్ మాస్క్ వేసేయండి

Best Web Hosting Provider In India 2024

జుట్టు సహజంగా మెరవాలన్నా, పొడవుగా పెరగాలన్నా ఇంట్లో ఈ మందార మెంతుల హెయిర్ మాస్క్ వేసేయండి

Haritha Chappa HT Telugu

చాలా మంది జుట్టు రాలిపోవడం, జుట్టు రాలడం వంటి వాటితో బాధపడుతుంటారు. అలాగే జుట్టు పొడిబారి నిర్జీవంగా మారితే ఖరీదైన బయోటిన్ ట్రీట్మెంట్ తీసుకునే బదులు ఈ ఆయుర్వేద, హోం రెమెడీస్ తో జుట్టు రాలడాన్ని నివారించుకోవచ్చు. ఈ హెయిర్ మాస్క్ ఇంట్లో ఉపయోగపడుతుంది.

హెయిర్ ఫాల్ ఆపే హెయిర్ మాస్క్

జుట్టు ఒత్తుగా ఉంటే ఎవరైనా అందంగా కనిపిస్తారు. కానీ మహిళలు ఇప్పుడు జుట్టు రాలిపోయే సమస్యను ఎదుర్కొంటున్నారు. అందంగా కనిపించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే జుట్టును కాపాడుకోవడానికి చిన్న చిన్న చిట్కాలను కూడా పాటించాలి.

జుట్టు రాలడాన్ని నివారించడానికి కొందరు మార్కెట్లలో విక్రయించే ఉత్పత్తులపై ఆధారపడతారు. అయితే షాంపూల్లో కెమికల్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి జుట్టును కాపాడుకోవడానికి సహజసిద్ధమైన చిట్కాలను పాటించడమే ఉత్తమం. ఆయుర్వేదంలో ఎన్నో హోయిర్ మాస్క్ ల గురించి చెప్పారు.

జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఆధునిక మహిళలు ఇప్పుడు సెలూన్లకు వెళుతున్నారు. అక్కడ ఖరీదైన బయోటిన్ చికిత్స తీసుకుంటున్నారు. దాని ధరను అందరూ భరించలేరు. ఈ ఖరీదైన హెయిర్ ఫాల్ ట్రీట్ మెంట్ కు బదులుగా ఇంట్లోనే హెయిర్ మాస్క్ తయారుచేసుకోవచ్చు. ఈ హెయిర్ మాస్క్ మీ జుట్టును బలోపేతం చేస్తుంది. వెంట్రుకలను కూడా సిల్కీగా, షైనీగా ఉంచుతుంది.

జుట్టు రాలకుండా ఆపే ఈ హెయిర్ మాస్క్ గురించి వివరాలను మన్ ప్రీత్ కౌర్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ఈమె మందార పూలు, మెంతులు, పెరుగుతో ఎలా హెయిర్ మాస్క్ వేసుకోవాలో చెప్పారు.

హెయిర్ ఫాల్ ఆపే మాస్క్
హెయిర్ ఫాల్ ఆపే మాస్క్ (Pixabay)

హెయిర్ మాస్క్ తయారీ

జుట్టు రాలకుండా అడ్డుకుని, వెంట్రుకలను బలోపేతం చేసే హెయిర్ మాస్క్ తయారీకి పుల్లని పెరుగు, మెంతి గింజలు, మందార పూల పొడి అవసరం. వీటన్నింటినీ కలిపి జుట్టుకు అప్లై చేయాలి. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ఈ హెయిర్ మాస్క్ తయారు చేసే ముందు పుల్లని పెరుగును రాగి గిన్నెలో వేసి కాసేపు ఉంచాలి. దీనివల్ల పుల్లదనం ఇంకా పెరుగుతుంది. దీని వల్ల జుట్టుకు ఎన్నో లాభాలు ఉన్నాయి.

పెరుగును ఇలా రాగిపాత్రలో ఉంచి ఉపయోగించడం వల్ల జుట్టుకు రాగి లోహ లక్షణాలు కూడా లభిస్తాయి. ఒక గిన్నెలో ఈ పుల్లని పెరుగు రెండు మూడు స్పూన్లు వేయాలి. ఇప్పుడు మందార పూలను కళాయిలో వేసి తేమ పోయేదాకా వేయించాలి. తరువాత వాటిని పొడిలా చేసుకుని ఇందులో కలుపుకోవాలి. లేదా నానబెట్టిన మెంతులు, పచ్చి మందార పూలు మిక్సీలో వేసి పేస్టులా చేసుకుని వాడవచ్చు. ఈ మొత్తం మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట పాటూ వదిలేయాలి.

ఈ మొత్తం హెయిర్ మాస్క్ ను జుట్టు మూలాల నుంచి అప్లై చేయాలి. ఇప్పుడు తలకు పాలిథిన్ కవర్ కట్టి అలా వదిలేయండి. దీని వల్ల జుట్టుకు వెచ్చదనం వస్తుంది. ఈ పదార్ధాల ప్రయోజనాలు జుట్టు మూలాలకు చేరుతాయి. 40 నిమిషాల తర్వాత మీ జుట్టును కడగాలి. ఈ హెయిర్ మాస్క్ జుట్టును బలోపేతం చేయడమే కాకుండా మెరిసేలా చేస్తుంది.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024