బ్రహ్మముడి మే 26 ఎపిసోడ్: రాజ్ కోసం తండ్రిని చంపేసిన యామిని- కావ్య లవ్ ప్రపోజ్ ఆపేందుకు స్కెచ్- కష్టాల్లో కల్యాణ్ అప్పు!

Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి మే 26 ఎపిసోడ్: రాజ్ కోసం తండ్రిని చంపేసిన యామిని- కావ్య లవ్ ప్రపోజ్ ఆపేందుకు స్కెచ్- కష్టాల్లో కల్యాణ్ అప్పు!

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి సీరియల్ మే 26 ఎపిసోడ్‌లో అప్పు, కల్యాణ్‌లకు శోభనం ముహుర్తం పెట్టి ట్విస్ట్ ఇస్తుంది ధాన్యలక్ష్మీ. దానికి రాజ్ సపోర్ట్ చేస్తాడు. కావ్యకు రాజ్ లవ్ ప్రపోజ్ చేయకుండా ఉండేందుకు ఏకంగా తండ్రినే చింపేయడానికి స్కెచ్ వేస్తుంది యామిని. స్వప్న కోసం రాహుల్ మల్లెపూలు తీసుకొస్తాడు. కానీ, స్వప్న నమ్మదు.

బ్రహ్మముడి సీరియల్‌ మే 26వ తేది ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో స్వప్న రవ్వల నెక్లెస్ ప్లేసులో డూప్లికేట్ పెట్టి రాహుల్ వెళ్లబోతుంటే స్వప్న వస్తుంది. దాంతో కంగారుపడుతాడు రాహుల్. ఏమైనా ప్లాన్ చేశావా. నా కబోర్డ్ ముందు ఏం చేస్తున్నావ్. నన్ను చూడగానే ఎందుకు భయపడుతున్నావ్. ఏసీ గదిలో చెమట పట్టేంతలా ఆలోచనలు ఏమున్నాయి. ఏదో తప్పు చేశావ్. అది నీ మొహంలోనే నాకు క్లారిటీగా కనిపిస్తుంది అని స్వప్న అంటుంది.

స్వప్న కోసం మల్లెపూలు

వెంటనే కబోర్డ్ ఓపెన్ చేసి నగలు చూస్తుంది. అన్ని కరెక్ట్‌గానే ఉన్నాయి అని స్వప్న అంటుంది. అంటే, నీ నగలు కొట్టేయడానికి వచ్చానని అనుకుంటున్నావా అని రాహుల్ అంటాడు. నేను అనలేదే అని స్వప్న అంటుంది. నన్ను అనుమానించడానికి నీకు మనసెల వచ్చింది. సిటీ అంత తిరిగి నీకోసం ఒకటి తీసుకొచ్చాను మల్లెపూలు తీసి చూపిస్తాడు రాహుల్.

ఇది ఎవరికి తీసుకొచ్చావ్. వేరే వాళ్లకు తీసుకొచ్చి మిగిలిన పూలు ఇటు తెచ్చావా అని స్వప్న అంటుంది. మారిపోయిన దొంగను గుచ్చి గుచ్చి ఎందుకంటావ్. నా వల్ల సఫర్ అవుతున్నావని, కొంచెమైనా మారుదామని ట్రై చేస్తే ఎందుకు నమ్మవు అని రాహుల్ అంటాడు. నువ్ మీ అమ్మ మారారు అంటే ఎప్పటికీ నమ్మను. భర్త కావాలంటే మల్లెపూలు తీసుకురావడం కాదు బాధ్యత తీసుకోవాలి. అది నీకు ఎప్పుడు చేతకాదు అని స్వప్న వెళ్లిపోతుంది.

మల్లెపూలు పక్కన పడేసి హమ్మయ్య దీనికి అనుమానం రాలేదు. వెంటనే బ్యాంక్ నుంచి ఆ ఏడు వారాల నగలు తెప్పించి కొట్టేయాలి. ఆస్తి రాగానే నిన్ను నీ కూతురుని బయటకు గెంటేస్తాను చూడు అని రాహుల్ అనుకుంటాడు. రాజ్ కోసం అపర్ణ ఎదురుచూస్తుంది. రాజ్ వస్తాడు ఇలా వచ్చి రిలాక్స్ అవ్వమని ప్రకాశం అంటాడు. నీలా మర్చిపోయి ప్రశాంతంగా ఉండలేనుగా ప్రకాశం అని అపర్ణ అంటుంది.

నిందలు వేయకండి

అస్తమానం మర్చిపోతానంటూ నా మీద నిందలు వేయకండి వదిన. రాజ్ ఇక్కడికి వచ్చి యామిని పెళ్లి విషయం మాట్లాడుతాడు అంతే కదా అని ప్రకాశం అంటాడు. దాంతో ఇందిరాదేవి, అపర్ణ అయ్యో అంటూ తలలు పట్టుకుంటారు. కావ్య ప్రేమ గురించి అని చెబుతారు. ఇంతలో రాజ్ పంతులును పట్టుకుని వస్తాడు. వీడికి కూడా ప్రకాశంలా మతిమరుపు వచ్చిందా ఏంటీ అని ఇందిరాదేవి అంటుంది.

రాజ్ రాగానే పంతులు తీసుకొచ్చావేంటీ అని అడుగుతారు. వెనుక వచ్చిన పంతులును రాజ్ చూసుకోడు. పంతులు ముహుర్తం పెట్టడానికి వచ్చానని చెబుతాడు. ఆ ముహుర్తానికి నాకు సంబంధం లేదని రాజ్ అంటాడు. దాంతో రాజ్‌ను నిలదీస్తుంది ఇందిరాదేవి. ఇంతలో ధాన్యలక్ష్మీ తానే పంతులును పిలిచినట్లు చెబుతుంది. ఈ వయసులో ఏ ముహుర్తం పెట్టడానికి పిలిచావ్ అని ప్రకాశం అంటాడు.

శోభనం ముహుర్తం పెట్టడానికి పిలిచాను అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో ప్రకాశం సిగ్గుపడతాడు. అంతా షాక్ అవుతారు. ఇప్పుడు.. మళ్లీ ఈ వయసులో మళ్లీ శోభనం అంటే.. అని ప్రకాశం మెలికలు తిరుగుతుంటాడు. దాంతో కల్యాణ్, అప్పులకు ఇవాళ శోభన ముహుర్తం పెట్టడానికి పిలిచానని ధాన్యలక్ష్మీ అంటుంది. కొన్నిరోజులు ఆగమని అప్పు, మూడు నెలలు ఆగుదామని కల్యాణ్ అంటాడు.

రాజ్ సపోర్ట్

దాంతో ఈ ముహుర్తాన్ని అడ్డుపెట్టుకుని కావ్యకు లవ్ ప్రపోజ్ చేయాలి అని రాజ్ అనుకుంటాడు. ధాన్యలక్ష్మీకి రాజ్ సపోర్ట్ చేస్తూ శోభనం గురించి అంటాడు రాజ్. నువ్ నీ కొడుకు గురించి ఆలోచించండం చాలా బాగుంది పిన్నీ. నీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను అంటాడు రాజ్. తల్లిని బాధపెట్టడం ఏంట్రా. ఇవాళ నీకు ముహుర్తం పెడుతున్నారు. నేను, కళావతి కలిసి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తామని రాజ్ అంటాడు.

పంతులుని దివ్యమైన ముహుర్తం పెట్టమని చెబుతాడు రాజ్. కూచి ఏంటీ ఇదంతా అని అప్పు అంటుంది. నాకు మాత్రం ఏం తెలుసు. మా అమ్మ ఇలా ట్విస్ట్ ఇస్తుందనుకోలేదు అని కల్యాణ్ అంటాడు. ఇవాళ నాకు నైట్ డ్యూటీ అని అప్పు అంటుంది. దాంతో కల్యాణ్, అప్పు ఇద్దరూ కష్టాల్లో పడతారు. ఈరోజు రాత్రి 11 గంటల 40 నిమిషాలకు దివ్వమైన ముహుర్తం ఉందని పంతులు అంటే అదే ఖాయం చేయమని ధాన్యం అంటుంది.

కల్యాణ్ చెప్పిన వినకుండా ఫైనల్ చేస్తుంది ధాన్యలక్ష్మీ. ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేద్దామని కావ్యతో రాజ్ అంటే అపర్ణ, ఇందిరాదేవి ఓ విషయం మాట్లాడాలని తీసుకెళ్తారు. వాళ్ల శోభనం గురించి నీకెందుకురా అని అపర్ణ అంటుంది. ఈరోజు వాళ్లిద్దరికి శోభనం అయితే గదిలో డెకరేట్ చేయాలి. ఆ వంకతో కళావతిని గదిలోకి తీసుకెళ్లి సిగ్గు పడతాడు. దాంతో పెళ్లికి ప్రపోజ్ చేయమంటే నువ్ ఏకంగా శోభనానికే ప్లాన్ చేస్తున్నావా అని ఇందిరాదేవి తిడుతుంది.

శభాష్ అనిపించుకునే

ఆ వంకతో కళావతికి దగ్గరవుతాను. ఇంప్రెస్ చేసి లవ్ ప్రపోజ్ చేస్తాను అని రాజ్ అంటాడు. వెళ్లి అదేదో తగలెట్టు అని ఇందిరాదేవి అంటుంది. ఇవాళ మీతో శభాష్ అనిపించుకునే ఇంటికి వెళ్తాను అని రాజ్ అంటే.. ముహుర్తంతో నేను మీ ఇంటికి వస్తానని ఇందిరాదేవి అంటుంది. అయితే, ముహుర్తం, ఫంక్షన్ హాల్ ఏది బాగుంటాయో సెలెక్ట్ చేసుకోండి. కళావతి మనసు గెలిచొస్తాను అని రాజ్ వెళ్లిపోతాడు.

వీడు చెడగొట్టుకునేలా ఉన్నాడని అపర్ణ భయపడుతుంది. మరోవైపు యామినికి రుద్రాణి కాల్ చేస్తుంది. అంత పెద్ద న్యూస్ చెబితే చివరికి రాజ్‌ను మా ఇంటికి పంపించావేంటీ. ఎందుకు పంపిచావ్ అని రుద్రాణి ఆవేశంగా అంటుంది. ఇప్పుడు ఏం ప్లాన్ చేసిన రాజ్‌కు డౌట్ వస్తుంది. మరింత రెచ్చిపోతాడు. నేరుగా చెబితే ఎదిరిస్తారు. అదే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తే లొంగిపోతారు అని యామిని అంటాడు.

మగాళ్లంతా ఎమోషనల్ ఫూల్స్ అని నిరూపించబోతున్నాను. కావ్యకు లవ్ ప్రపోజ్ చేయడానికి వెళ్లిన రాజ్ తిరిగి పరుగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చేలా చేయబోతున్నాను. నాతో పెళ్లి పీటలు ఎక్కబోయేలా చేయబోతున్నాను. మనిషి ప్రాణాలకు ఎంతో విలువ ఇస్తాడు. ఆ వీక్‌నెస్‌ను నేను వాడుకోబోతున్నాను. జస్ట్ వెయిట్ చేయండి అని కాల్ కట్ చేస్తుంది యామిని.

తండ్రిని చంపేసిన యామిని

డాడ్ నేనంటే మీకు ఇష్టమేగా. ఏం అడిగిన ఇస్తారా అని యామిని అడుగుతుంది. ప్రాణాలు ఇవ్వమన్న ఇస్తాను అని తండ్రి అంటాడు. రాజ్ కోసం ఈరోజు నేను చేయబోయే పనిలో మీరే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పను. నేను చేసేటప్పుడు మీకే తెలుస్తుంది అని యామిని అంటుంది. ఓకే అని తండ్రి అంటాడు. దాంతో యామిని కత్తి పట్టుకుని సైకోలా చూస్తుంది.

తండ్రిని కత్తితో పొడిచి రాజ్ లవ్ ప్రపోజ్‌ను ఆపాలని యామిని ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అలా తండ్రిని చంపేసి కావ్యకు రాజ్ చేసే లవ్ ప్రపోజ్‌ను ఆపాలని యామిని స్కెచ్ వేసిన యామిని అలాగే చేస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024