Best Web Hosting Provider In India 2024
ఇదెక్కడి బ్యాటింగ్ గురూ.. 2 రన్స్ కే టీమ్ ఆలౌట్.. అందులో ఓ వైడ్! 9 మంది డకౌట్
క్రికెట్లో వింతైన రికార్డులు చూస్తూనే ఉంటాం. ఇది కూడా అలాంటిదే. ఓ క్రికెట్ టీమ్ అది కూడా మంచి పేరున్న లీగ్ లో కేవలం 2 రన్స్ కే ఆలౌటైంది. ఇందులో ఒకటి వైడ్ కావడం గమనార్హం. ఆ టీమ్ ఏదంటే?
గల్లీ క్రికెట్లోనే ఏ టీమ్ కూడా 2 రన్స్ కు ఆలౌట్ కాదు. కానీ ఇంగ్లాండ్ లోని మిడిలెసెక్స్ కౌంటీ లీగ్ లో మాత్రం ఆ విచిత్ర సంఘటన జరిగింది. ఓ టీమ్ కేవలం రెండు పరుగులకే కుప్పకూలింది. ఇందులో ఒకటి వైడ్ కావడం గమనార్హం. అంటే 11 మంది బ్యాటర్లు కలిసి చేసింది ఒక్కటంటే ఒక్క పరుగు మాత్రమే. మిడిలెసెక్స్ కౌంటీ లీగ్ లో నార్త్ లండన్ సీసీ, రిచ్మండ్ ఫోర్త్ ఎలెవన్ జట్ల మధ్య మ్యాచ్ లో ఇది జరిగింది.
426 పరుగులు
మిడిలెసెక్స్ కౌంటీ లీగ్ మూడో టైర్ డివిజన్ వన్ మ్యాచ్ లో నార్త్ లండన్ 3, రిచ్మండ్ 4 టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన నార్త్ లండన్ టీమ్ 45 ఓవర్లలో 6 వికెట్లకు 426 పరుగులు చేసింది. డానియల్ సిమన్స్ (140) భారీ సెంచరీ బాదాడు. జాక్ లెవిట్ (43), నబిల్ (42) కూడా రాణించాడు.
ఒక్కటంటే ఒకటే
నార్త్ లండన్ తో మ్యాచ్ లో ఛేజింగ్ లో రిచ్మండ్ 4 దారుణమైన ప్రదర్శన చేసింది. బ్యాటింగ్ లో ఘోరంగా ఫెయిలైంది. టీమ్ అంతా కలిసి అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. ఛేజింగ్ లో రిచ్మండ్ 5.4 ఓవర్లలో 2 పరుగులకే ఆలౌటైంది. ఇందులో ఒక పరుగు వైడ్ రూపంతో ఎక్స్ ట్రాగా వచ్చిందే. అంటే టీమ్ అంతా కలిసి చేసింది ఒకటే ఒక్క పరుగు. అది కూడా టామ్ పెట్రిడ్స్ చేశాడు.
సున్నాకే పెవిలియన్ కు
రిచ్మండ్ 4 ఇన్నింగ్స్ లో 9 మంది బ్యాటర్లు డకౌట్ అయ్యారు. సున్నాకే పెవిలియన్ చేరిపోయారు. మాథ్యూ రాన్సన్ 5 వికెట్లు, థామస్ పాటన్ 3 వికెట్లు పడగొట్టారు. లాస్ట్ బ్యాటర్ విక్రమ్ మంగళూరు బ్యాటింగ్ కు రాలేదు. ఛేజింగ్ లో రిచ్మండ్ 2 పరుగులే చేయడంతో నార్త్ లండన్ 424 పరుగుల తేడాతో విజయం సాధించింది.
10 పాయింట్లు
ఈ విజయంతో నార్త్ లండన్ కు 10 పాయింట్లు వచ్చాయి. ఆ టీమ్ ఏకంగా 424 పరుగుల తేడాతో బంపర్ విక్టరీ సాధించింది. ఛేజింగ్ లో రిచ్మండ్ టీమ్ 2 రన్స్ కే ఆలౌట్ కావడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ టీమ్ పై ట్రోల్స్ వస్తున్నాయి. ఈ టీమ్ కంటే గల్లీ జట్టు మేలు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Best Web Hosting Provider In India 2024
Source link