పిల్లల విషయంలో ప్రతి తల్లిదండ్రికీ ఈ 7 రకాల భయాలు ఉంటాయట! అవేంటో తెలుసా?

Best Web Hosting Provider In India 2024

పిల్లల విషయంలో ప్రతి తల్లిదండ్రికీ ఈ 7 రకాల భయాలు ఉంటాయట! అవేంటో తెలుసా?

Ramya Sri Marka HT Telugu

పిల్లలు పుట్టగానే వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ఎదగాలని ప్రతి తల్లిదండ్రి కల కంటారు. కానీ ఆ కల పక్కనే కొన్ని భయాలు, ఆందోళనలు కూడా ఉంటాయి. తమ పిల్లల భవిష్యత్తు, భద్రత గురించి తల్లిదండ్రులకు ఎప్పుడూ కొన్ని సందేహాలుంటాయి. ఆ 7 సాధారణ భయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

తల్లిదండ్రుల్లో ఉండే సాధారణ భయాలు (shutterstock)

తమ పిల్లలు రేపటి రోజున ఆత్మవిశ్వాసంతో, విజయవంతంగా బతకాలని ప్రతి తల్లిదండ్రికీ కల ఉంటుంది. బిడ్డ పుట్టగానే ఈ కల మొదలవుతుంది. కానీ ఈ అందమైన కలతో పాటే, తల్లిదండ్రుల మనసులో కొన్ని అనుమానాలు, ఆందోళనలు కూడా మొదలవుతాయి. పిల్లల భవిష్యత్తు, వాళ్ళ భద్రత, వాళ్ళు సంతోషంగా ఉంటారా లేదా వంటి రకరకాల భయాలు జీవితాంతం వెంటాడుతాయి. ఈ భయాలు పిల్లల వయసు మారినప్పుడు, చుట్టూ ఉన్న వాతావరణం మారినప్పుడు, సమాజంలో మార్పులు వచ్చినప్పుడు మారుతూ ఉంటాయి. అయినప్పటికీ తల్లిదండ్రుల మనసులో తమ పిల్లల గురించి కొన్ని 7 సాధారణ భయాలు మాత్రం ఎప్పుడూ ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

తల్లిదండ్రులకు తమ పిల్లల గురించి ఈ 7 రకాల భయాలు ఉంటాయి

1. భద్రత గురించిన ఆందోళన

పిల్లల శారీరక భద్రత గురించి తల్లిదండ్రులు ఎల్లప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటారు. ఉదాహరణకు, రోడ్డు ప్రమాదాలు, అపహరణలు లేదా ఇంటి వెలుపల ఆడుకునేటప్పుడు జరిగే ప్రమాదాల గురించి నిరంతరం ఆలోచిస్తారు. ‘నా బిడ్డ పాఠశాలకు వెళ్ళేటప్పుడు సురక్షితంగా ఉన్నాడా?’ లేదా ‘పిల్లలు ఒంటరిగా ఆడుకునేటప్పుడు సురక్షితంగా ఉంటారా?’ అనే ప్రశ్నలు వారిని వేధిస్తూ ఉంటాయి.

తల్లిదండ్రులకు తమ పిల్లల గురించి ఈ 7 రకాల భయాలు ఉంటాయి
తల్లిదండ్రులకు తమ పిల్లల గురించి ఈ 7 రకాల భయాలు ఉంటాయి

2. ఆరోగ్యంపై ఆందోళనలు

తల్లిదండ్రులు తమ పిల్లల శారీరక,మానసిక ఆరోగ్యం గురించి ఎల్లప్పుడూ కలత చెందుతూ ఉంటారు. వారి ఆహారపు అలవాట్లు, ఊబకాయం, డయాబెటిస్ లేదా మానసిక ఒత్తిడి వంటివి వారిని ఆందోళనకు గురిచేస్తాయి. ‘నా బిడ్డ సరిపడా పోషక ఆహారం తీసుకుంటున్నాడా?’ లేదా ‘అతను ఏదైనా నిరాశ లేదా ఆందోళనతో బాధపడుతున్నాడా?’ అనే ఆలోచనలు వారిని నిద్రపట్టనివ్వవు.

3. విద్య, భవిష్యత్తు గురించిన ఆందోళన

ఈ భయం చాలా మంది తల్లిదండ్రులకు ఉంటుంది. వారి పిల్లలు చదువులో వెనుకబడి ఉంటారా లేదా భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదించగలరా అనేది వారిని తరచుగా ఆలోచింపజేస్తుంది. ‘వారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారా?’ లేదా ‘వారు తమ వృత్తిలో స్థిరత్వం పొందగలరా?’ అనే ప్రశ్నలు వారికి నిరంతరం తలెత్తుతాయి.

4. సోషల్ మీడియా, సాంకేతికత ప్రభావం

నేటి కాలంలో సోషల్ మీడియా, పెరుగుతున్న స్క్రీన్ టైమ్ కారణంగా తల్లిదండ్రులు పిల్లల మానసిక ఆరోగ్యం, సైబర్ బుల్లింగ్ లేదా అనుచిత వ్యక్తులతో సంబంధాల గురించి కూడా ఆందోళన చెందుతున్నారు. ‘నా బిడ్డ ఆన్ లైన్ లో సురక్షితంగా ఉన్నాడా?’ లేదా ‘అతను సోషల్ మీడియా ఒత్తిడిని తట్టుకోగలడా?’ వంటి భయాలు కొత్తగా వచ్చి చేరాయి.

5. చెడు సహవాసం భయం

తల్లిదండ్రులకు ఈ భయం కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. వారి పిల్లలు పాఠశాల, కళాశాల లేదా కార్యాలయంలో తప్పుడు స్నేహితుల సహవాసంలో పడి మాదకద్రవ్యాలు, ధూమపానం లేదా తప్పుడు ప్రవర్తన వైపు వెళ్ళిపోతారా అనేది వారిని కలవరపరుస్తుంది. ‘వారి స్నేహితులు వారికి సరైనవారా?’ లేదా ‘వారు తప్పుడు మార్గంలో వెళ్ళిపోతారా?’ అని నిత్యం ఆలోచిస్తుంటారు.

6. మానసిక ఆరోగ్యం, భావోద్వేగ స్థిరత్వం

తల్లిదండ్రులకు తమ పిల్లల గురించి ఈ 7 రకాల భయాలు ఉంటాయి
తల్లిదండ్రులకు తమ పిల్లల గురించి ఈ 7 రకాల భయాలు ఉంటాయి

పిల్లల ఒత్తిడి, ఆందోళన లేదా ఆత్మవిశ్వాస లోపం తల్లిదండ్రులకు తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది. ‘నా బిడ్డ తన భావోద్వేగాలను సరిగ్గా వ్యక్తపరుస్తున్నాడా?’ లేదా ‘అతను ఆనందం, ఆత్మవిశ్వాసంతో ఉన్నాడా?’ అనే సందేహాలు వారిని నిరంతరం వేధిస్తాయి.

7. బుల్లింగ్ భయం

పాఠశాల లేదా సామాజిక వాతావరణంలో పిల్లలతో జరిగే హింస లేదా వేధింపులు (బుల్లింగ్) తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేస్తాయి. ‘నా బిడ్డను పాఠశాలలో వేధిస్తున్నారా?’ లేదా ‘వారు బుల్లింగ్ ను ఎదుర్కోగలరా?’ అనే భయాలు వారిని నిద్రపట్టనివ్వవు.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024