





Best Web Hosting Provider In India 2024

వణికించేలా ట్విస్టులతో సాగే సిద్ధార్థ్ హారర్ థ్రిల్లర్ చిత్రం.. ఫ్రీగా చూసేయవచ్చు
యూట్యూబ్‍లో ఫ్రీగా హారర్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఓ చిత్రం మంచి ఆప్షన్‍గా ఉంది. భయపెట్టేలా థ్రిల్లింగ్‍గా ఈ చిత్రం సాగుతుంది. మధ్యలో ట్విస్టులు కూడా ఆకట్టుకుంటాయి. అదేదంటే..
హారర్ థ్రిల్లర్ చిత్రాలంటే చాలా మంది ఇష్టపడతారు. కొత్తవైనా, పాతవైనా చూసేస్తుంటారు. ఈ జానర్లో కొన్ని సినిమాలు ఇప్పుడు చూసినా థ్రిల్లింగ్‍గా అనిపిస్తుంటాయి. అలాంటి సినిమానే ‘అవల్’. ఈ తమిళ హారర్ థ్రిల్లర్ చిత్రం తెలుగులోనూ ‘గృహం’ పేరుతో విడుదలైంది. 2017లో రిలీజై మంచి హిట్ కొట్టింది. సిద్ధార్థ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీని ఫ్రీగా చూసేయవచ్చు.
ఎక్కడ చూడొచ్చంటే..
గృహం సినిమా యూట్యూబ్‍లో మ్యాట్నీ షో అనే ఛానెల్‍లో అందుబాటులో అందుబాటులో ఉంది. అక్కడ ఈ మూవీని ఉచితంగా చూడొచ్చు. ఈ చిత్రం తమిళ వెర్షన్ కూడా యూట్యూబ్‍లో ఉంది.
అచ్చమైన హారర్ థ్రిల్లర్‌లా..
అవల్ (తెలుగులో గృహం) సినిమాకు మిలింద్ రవూ దర్శకత్వం వహించారు. కామెడీ లాంటి పక్కదోవ పట్టకుండా అచ్చమైన హారర్ థ్రిల్లర్‌లా తెరకెక్కించారు. హారర్ ఎలిమిమెంట్లు, ట్విస్టులతో ఈ మూవీ ఆకట్టుకుంటుంది. ఆత్మలు, అమ్మాయికి దెయ్యం పట్టడం, భయంకరమైన ప్లాష్‍బ్యాక్, భయపెట్టే సీన్లు ఇలా థ్రిల్లింగ్‍గా ఈ చిత్రం సాగుతుంది. ఇంటర్వెల్ కూడా భయపెట్టేస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుంది.
గృహం సినిమాలో సిద్ధార్థ్ సరసన ఆండ్రియా జెరెమియా నటించారు. ఆనిషా జెలీనా, అతుల్ కులకర్ణి, సురేశ్, అవినాశ్ రఘుదేవన్, ప్రకాశ్ బెలవాది, భావనా అనేజా, ధీరజ్ వైడీ ఈ మూవీలో కీలకపాత్రలు పోషించారు. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, ఈటాకీ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్లు ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశాయి. సిద్ధార్థ్ కూడా ఓ నిర్మాతగా ఉన్నారు. ఈ మూవీకి గిరీశ్ డీ సంగీతం అందించారు.
గృహం స్టోరీలైన్
డాక్టర్ క్రిష్ అలియాజ్ కృష్ణకుమార్ (సిద్ధార్థ్) తన భార్య లక్ష్మి (ఆండ్రియా జెరెమియా)తో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. వారి ఇంటి ఎదురుగా ఉండే ఓ పురాతనమైన పెద్ద భవనంలోకి పౌల్ డికోస్టా (అతుల్ కులకర్ణి) ఫ్యామిలీ వస్తుంది. వారికి జెన్నీ ఆలియాజ్ జెన్నీఫర్ (అనిషా ఏంజెలినా), సారా అనే కూతుళ్లు ఉంటారు. క్రిష్, లక్ష్మిని పౌల్ ఓ రోజు డిన్నర్‌కు పిలుస్తాడు. అప్పుడు సడెన్‍గా జెన్నీఫర్ ఓ బావిలోకి దూకేస్తుంది. క్రిష్ కాపాడతాడు.
జెన్నీలో దెయ్యం ఉందని క్రిష్, పౌల్ గుర్తిస్తారు. ఓ పాస్టర్‌ను తీసుకొచ్చి ఆత్మను పంపేయాలని అనుకుంటారు. అప్పుడే అనుకోని ఘటనలు జరుగుతాయి. ఆ ఆత్మ గతం వెల్లడవుతుంది. అసలు జెన్నీకి పట్టిన ఆత్మ ఎవరిది? ఆ భయానక గతం ఏంటి? ఎన్ని ఆత్మలు ఉన్నాయి? క్రిష్‍కు ఎదురైన సవాళ్లు ఏంటి? అనేది గృహం సినిమాలో ఉంటాయి. క్రిష్ విషయంలో ఎదురయ్యే ఓ భారీ ట్విస్ట్ థ్రిల్ ఇస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్