ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడటానికి 5 కారణాలు ఇవే

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడటానికి 5 కారణాలు ఇవే

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి మరో రెండు రోజుల్లో తెలుగులో ఓ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా రాబోతోంది. ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బ్లాక్‌బస్టర్లలో ఒకటైన ఈ మూవీని అస్సలు మిస్ కావద్దు. దీనిని ఎందుకు చూడాలన్నదానికి 5 కారణాలు ఉన్నాయి.

ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడటానికి 5 కారణాలు ఇవే

తుడరుం (Thudarum).. ఈ మలయాళ మూవీ టైటిల్ కు అర్థమేంటో తెలుసా? ఇంకా కొనసాగుతుంది అని అర్థం. టైటిల్ మార్చకుండా తెలుగులోనూ అలాగే రిలీజ్ చేస్తున్నందుకు దీనిపై మొదట్లో విమర్శలు వెల్లువెత్తినా.. తర్వాత ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ.. గురువారం (మే 29) నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతోంది.

తుడరుం ఎందుకు చూడాలంటే?

మలయాళం థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. అక్కడి ఫిల్మ్ మేకర్స్ ఈ జానర్లలో సినిమాలు తీయడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా వచ్చిన తుడరుం కూడా అలాంటిదే. ఈ సినిమాను ఓటీటీలో చూడటానికి 5 కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

1. థ్రిల్లింగ్ స్టోరీ

అసలు ఈ తుడరుం మూవీ స్టోరీయే చాలా థ్రిల్లింగా అనిపిస్తుంది. తన భార్య, ఇద్దరు పిల్లలు, తనకెంతో ఇష్టమైన బ్లాక్ అంబాసిడర్ కారుతో కలిసి జీవిస్తున్న ఓ సాదాసీదా క్యాబ్ డ్రైవర్ బెంజ్ షణ్ముగం చుట్టూ తిరిగే కథ ఇది. తన కొడుకు స్నేహితులు తన కారును తీసుకెళ్లడం, ఆ తర్వాత దానిని పోలీసులు సీజ్ చేయడం, అసలు అలా ఎందుకు జరిగిందో ఇంటర్వెల్ సీన్లో రివీల్ చేయడం మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. ఈ తుడరుం మూవీకి కేఆర్ సునీల్ కథ అందించాడు.

2. తరుణ్ మూర్తి డైరెక్షన్

మలయాళంలో ఆపరేషన్ జావా, సౌదీ వెల్లక్కాలాంటి మూవీస్ తీసిన డైరెక్టర్ తరుణ్ మూర్తే ఈ తుడరుం మూవీని డైరెక్ట్ చేశాడు. మరోసారి ఒకప్పటి మోహన్‌లాల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడన్న ప్రశంసలు అతనిపై కురుస్తున్నాయి. అతని డైరెక్షనే ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. స్క్రీన్‌ప్లే కూడా అతడు అందించాడు.

3. మోహన్‌లాల్ నటన

మలయాళం సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మోహన్‌లాల్. ఈ ఏడాది ఇప్పటికే ఎల్2: ఎంపురాన్ లాంటి యాక్షన్ థ్రిల్లర్ తో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం మూవీని అందించిన అతడు.. ఈ తుడరుంలో నట విశ్వరూపం చూపించాడు. అచ్చూ దృశ్యం మూవీలాగే చిక్కుల్లో పడిన తన కుటుంబం, దీనికి రివేంజ్ తీర్చుకునే పాత్రలో మోహన్ లాల్ జీవించేశాడు.

4. మోహన్‌లాల్, శోభన జోడీ

అసలు తుడరుం మూవీలో మోహన్ లాల్, శోభన జోడీ అన్నదే ముందు నుంచీ ఎంతో ఆసక్తి రేపిన విషయం. ఓ వింటేజ్ జోడీని తీసుకొచ్చి రివేంజ్ థ్రిల్లర్ సినిమాలో చూపించి హిట్ కొట్టడం తరుణ్ మూర్తికే సాధ్యమైంది. మలయాళం సినిమాలో హిట్ జోడీగా పేరుగాంచిన మోహన్ లాల్, శోభన.. ఈసారి తుడరుంతో మరోసారి మ్యాజిక్ చేసింది.

5. ఆ పోలీసు పాత్ర

తుడరుం మూవీలో మోహన్ లాల్, శోభనతోపాటు బాగా ఆకట్టుకునే మరో క్యారెక్టర్ జార్జ్. ఈ పోలీస్ ఆఫీసర్ పాత్రలో జీవించేసిన నటుడి పేరు ప్రకాశ్ వర్మ. మోహన్ లాల్ తో పోటీ పడి నటించాడు. అతనితోపాటు బిను పప్పు, ఫర్హాన్ ఫాజిల్, థామస్ మాథ్యూలాంటి వాళ్లు పోషించిన కీలకపాత్రలు కూడా ఈ తుడరుం మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అందుకే గురువారం (మే 29) నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ తుడరుం మూవీని మిస్ కాకుండా చూడండి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024