జూన్ 2 నుంచి తిరుపతి గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, వాహన సేవల వివరాలివే

Best Web Hosting Provider In India 2024

జూన్ 2 నుంచి తిరుపతి గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, వాహన సేవల వివరాలివే

Bandaru Satyaprasad HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu

తిరుమలలో నిత్యం కన్నుల పండుగే. దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులతో తిరుమల శోభాయమానంగా కనిపిస్తుంది. తిరుమలలో జూన్ నెలలో నిర్వహించే విశేష పర్వ దినాలను టీటీడీ ప్రకటించింది. అలాగే తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 02 నుండి జూన్ 10 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది.

జూన్ 2 నుంచి తిరుపతి గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, వాహన సేవల వివరాలు

తిరుపతి గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 02 నుండి జూన్ 10వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో పోస్టర్ ను టీటీడీ ఈవో జె. శ్యామల రావు ఆవిష్కరించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో మంగళవారం ఆయన పోస్టర్ ను ఆవిష్కరించారు.

విస్తృత ఏర్పాట్లు

టీటీడీ ఈవో మాట్లాడుతూ, వేసవి నేపథ్యంలో శ్రీగోవిందరాజ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

ఆలయంలో చలువ పందిళ్లు, వైట్ పెయింట్, ఆకట్టుకునేలా రంగోలీలు, విద్యుత్ అలంకరణలు, పెయింటింగ్స్, పుష్పలంకరణలు తదితర ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు జరుగనున్న వాహనసేవలకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

జూన్ 01వ తేదీ సాయంత్రం 5.30 గం.ల నుండి 8.00 గం.ల వరకు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 02వ తేదీ ఉదయం 07.02 నుండి 07.20 గం.ల వరకు మిథున లగ్నంలో ధ్వజారోహణము జరుగనుంది. రాత్రి 07 గం.లకు పెద్ద శేష వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు.

వాహన సేవలు

  • 03.06. 2025 – ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం
  • 04.06. 2025 – ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనం
  • 05.06. 2025 – ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం
  • 06.06. 2025 – ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనం
  • 07.06. 2025 – ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం
  • 08.06. 2025 – ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం
  • 09.06. 2025 – ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం
  • 10.06. 2025 – ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం

జూన్ నెల‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వదినాలు

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జూన్ నెల‌లో జ‌ర‌గ‌నున్న విశేష ప‌ర్వ దినాల వివ‌రాలను టీటీడీ ప్రకటించింది.

• ⁠జూన్ 5న మెయిన్ వ‌ర‌ద‌రాజ‌స్వామి వర్ష తిరు న‌క్షత్రం

• ⁠జూన్ 9న శ్రీ‌వారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం, న‌మ్మాళ్వార్ శాత్తుమొర‌

• ⁠జూన్ 11న శ్రీ‌వారి జ్యేష్ఠాభిషేకం స‌మాప్తం

• ⁠జూన్ 21 స్మార్త ఏకాద‌శి

• ⁠జూన్ 22న వైష్ణవ మాధ్వ ఏకాద‌శి

• ⁠జూన్ 26న పెరియాళ్వార్ ఉత్సవారంభం.

Bandaru Satyaprasad

TwittereMail
బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

టాపిక్

TirumalaTirupatiTtdTemplesAndhra Pradesh News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024