



Best Web Hosting Provider In India 2024
అమృత్ సర్ లో అనుమానాస్పద బబ్బర్ ఖల్సా ఉగ్రవాది చేతిలో పేలిన బాంబు; తెగిపడిన చేతులు
అమృతసర్ లో చోటు చేసుకున్న ఒక బాంబు పేలుడు ఘటనలో అనుమానాస్పద బబ్బర్ ఖల్సా ఉగ్రవాది చనిపోయాడు. మొదట్లో పేలుడు పదార్థాలను దుర్వినియోగం చేసిన కేసుగా భావించిన అధికారులు ఇప్పుడు ఉగ్రవాద కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
పంజాబ్ లోని అమృత్ సర్ లోని మజితా రోడ్ బైపాస్ ప్రాంతంలో జరిగిన శక్తివంతమైన పేలుడులో అనుమానిత ఉగ్రవాది హతమైనట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది.
చేతులు తెగిపడి దూరంగా పడ్డాయి..
పేలుడు ధాటికి ఆ వ్యక్తి చేతులు తెగిపడి దూరంగా పడిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. తొలుత పేలుడు పదార్థాలను దుర్వినియోగం చేసిన కేసుగా భావించిన అధికారులు ఇప్పుడు ఉగ్రవాద కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. భారీ పేలుడుతో ఉలిక్కిపడిన స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
స్క్రాప్ డీలర్ అనుకుని..
మొదట్లో స్క్రాప్ డీలర్ గా భావిస్తున్న ఆ వ్యక్తి లోహ వ్యర్థాల మధ్య దొరికిన పాత బాంబును విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించి ఉంటాడని, ఆ క్రమంలోనే పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసులు భావించారు. గ్యాంగ్ స్టర్లు లేదా ఉగ్రవాదుల ప్రమేయం ఉందని వారు భావించలేదు. పేలుడులో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. అయితే ఆ తర్వాత ఆ వ్యక్తి అనుమానిత ఉగ్రవాది అని పోలీసులకు తెలిసింది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link