




Best Web Hosting Provider In India 2024

తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్, స్కూల్ లాగిన్ లో సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల
తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. విద్యార్థులు స్కూల్ హెడ్ మాస్టర్ ను సంప్రదించి హాల్ టికెట్లు పొందవచ్చు.
తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లను స్కూల్ లాగిన్ లో అందుబాటులో ఉంచారు. ఎస్ఎస్సీ రెగ్యులర్, వొకేషనల్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల జూన్ 03 నుండి 13 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. మొత్తం 42,832 మంది సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో బాలురు 26,286, బాలికలు 16,546 మంది ఉన్నారు.
150 పరీక్షా కేంద్రాలు
జూన్ లో జరిగే పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 150 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హాల్ టికెట్లు, నామినల్ రోల్స్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు పంపించామని బోర్డు అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నుండి పొందవచ్చని తెలిపారు.
స్కూల్ లాగిన్ లాగిన్ లో
ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ వెబ్‌సైట్ www.bse.telangana.gov.inలో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు పరీక్ష రుసుము చెల్లించడానికి, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టిక్కెట్లను పొందడానికి సంబంధిత ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించవచ్చని బోర్డు అధికారులు తెలిపారు.
సంబంధిత కథనం
టాపిక్