చెప్పినట్లు చేయకపోతే బిల్డింగ్ మీది నుంచి తోసేస్తానని యాక్టర్స్‌ను బెదిరించా: మణిరత్నం కామెంట్స్ వైరల్

Best Web Hosting Provider In India 2024

చెప్పినట్లు చేయకపోతే బిల్డింగ్ మీది నుంచి తోసేస్తానని యాక్టర్స్‌ను బెదిరించా: మణిరత్నం కామెంట్స్ వైరల్

Hari Prasad S HT Telugu

డైరెక్టర్ మణిరత్నం తాను నటీనటులను ఎలా బెదిరించే వాడినో గుర్తు చేసుకున్నాడు. తన థగ్ లైఫ్ మూవీ రిలీజ్ కు ముందు హాలీవుడ్ రిపోర్టర్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో కమల్ హాసన్ తో కలిసి పని చేయడంపైనా అతడు స్పందించాడు.

చెప్పినట్లు చేయకపోతే బిల్డింగ్ మీది నుంచి తోసేస్తానని యాక్టర్స్‌ను బెదిరించా: మణిరత్నం కామెంట్స్ వైరల్ (AFP)

లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం త్వరలోనే థగ్ లైఫ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలుసు కదా. కమల్ హాసన్ తో కలిసి 38 ఏళ్ల తర్వాత అతడు ఈ మూవీ చేస్తున్నాడు. ఈ సందర్భంగా హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాతో మాట్లాడాడు. ఒకప్పుడు తాను నటీనటులను ఎలా బెదిరించే వాడో ఈ సందర్భంగా మణిరత్నం చెప్పుకొచ్చాడు.

వాళ్లను భయపెట్టేవాడిని..

మీతో పని చేసిన నటీనటులందరికీ స్వేచ్ఛను ఇచ్చేవారా అని ఈ ఇంటర్వ్యూలో మణిరత్నాన్ని అడిగితే.. అతడు ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది. అందరికీ తాను ఆ అవకాశం ఇవ్వనని, కొందరినైతే బెదిరించేవాడినని చెప్పడం గమనార్హం. “అందరికీ ఇవ్వను. కొందరిని బెదిరించాల్సి వస్తుంది. నేను చెప్పినట్లుగా చేయకపోతే నాలుగో అంతస్తు నుంచి కింద పడేస్తానని కొందరిని బెదిరించేవాడిని.

కొన్నిసార్లు ఓ ఐదేళ్ల పిల్లవాడు కూడా టైమ్ కాని టైమ్ లో పని చేస్తున్నప్పుడు మీరు చేయడానికి ఏంటి అని యాక్టర్స్ కు చెప్పాల్సి వస్తుంది. దీనికి ఒకటే పరిష్కారం ఉండదు. కానీ ఓ మంచి యాక్టర్ ఉంటే మాత్రం వాళ్ల పర్ఫార్మెన్స్ మంచి విలువను జోడిస్తుంది” అని మణిరత్నం అన్నాడు.

అయితే ఓ నటుడికి ఎలా నటించాలో చెప్పే వాడిని కాదని, ఎందుకంటే అది డైరెక్టర్ పని కాదని మణిరత్నం చెప్పాడు. కొన్నిసార్లు అలా చెబితే మంచి నటులు ఎవరైనా కాస్త బాధపడతారని అన్నాడు. థగ్ లైఫ్ షూటింగ్ సందర్భంగా కమల్ హాసన్ తో తనకు ఎలాంటి క్రియేటివ్ విభేదాలు లేవని కూడా స్పష్టం చేశాడు.

కమల్‌ చాలా ప్రతిభ కలిగిన నటుడు

కమల్ హాసన్ తో కలిసి నాయకుడు మూవీ చేసినప్పుడు అతడు తనను నమ్మాడని మణిరత్నం తెలిపాడు. “ఇది చాలా సింపుల్. ఒకవేళ బాగా చేయకపోతే అదే విషయం అతనితో చెప్పాలి. అయినా నన్ను అతడు బాగా విశ్వసించాడు. ఇలా వెళ్లు అంటే వెళ్లేవాడు.

అతడు మనల్ని నమ్ముతాడు. మనమేం చేస్తున్నామో మనకు తెలిస్తే అతడు మన వెంట వస్తాడు. అసలు ఎలాంటి సమస్యా లేదు. అతడు చాలా ప్రతిభ కలిగిన నటుడు. ఓ నటుడికి ఎంత ప్రతిభ ఉంటే అంత ఓ డైరెక్టర్ అవసరం అతనికి ఉంటుంది. బయటి నుంచి ఓ వ్యక్తి చూసి వాళ్లకు పరిమితులు గీయడం అనేది చాలా అవసరం” అని మణిరత్నం చెప్పాడు.

కమల్ హాసన్, త్రిష జంటగా నటించిన థగ్ లైఫ్ మూవీ జూన్ 5న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. 1987లో వచ్చిన నాయకుడు తర్వాత మణిరత్నం, కమల్ కాంబినేషన్ లో వస్తున్న తొలి మూవీ ఇదే. ఇందులో శింబు, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠీలాంటి వాళ్లు కూడా నటించారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024