




Best Web Hosting Provider In India 2024
‘క్లాస్ స్కిప్ చేస్తే వీసా రద్దు’- అమెరికాలోని భారతీయ విద్యార్థులకు మరో షాక్!
అమెరికాలో చదువుకుంటున్న భారతీయులు సహా అంతర్జాతీయ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. క్లాస్‌లు స్కిప్ చేసినా, డ్రాపౌట్ అయినా వీసాను రద్దు చేస్తామని ఇండియాలోని యూఎస్ ఎంబసీ ఒక ప్రకటన చేసింది.
అమెరికాలోని భారతీయ విద్యార్థులతో పాటు అంతర్జాతీయ స్టూడెంట్స్‌కి డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మరో షాక్ ఇచ్చింది! యూనివర్సిటీల్లో క్లాస్‌లకు వెళ్లకపోతే వీసా రద్దు చేస్తామని, భవిష్యత్తులో మళ్లీ యూఎస్ వీసాకు అప్లై చేయనివ్వమని అధికారులు వార్నింగ్ ఇచ్చారు.
అలా చేస్తే యూఎస్ స్టూడెంట్ వీసా రద్దు..
“డ్రాపౌట్ అయినా, క్లాస్‌లు స్కిప్ చేసినా, యూనివర్సిటీకి చెప్పకుండా స్టడీ ప్రోగ్రామ్ని మధ్యలో వదిలేసినా మీ స్టూడెంట్ వీసాను రద్దు చేస్తాము. భవిష్యత్తులో యూఎస్ వీసా అప్లికేషన్‌కి మీరు అర్హతను కూడా కోల్పోవచ్చు. వీసా నిబంధనలకు కట్టుబడి ఉండి, సమస్యలు రాకుండా చూసుకోండి,” అని భారత్‌లోని యూఎస్ ఎంబసీ నుంచి వచ్చిన అధికారిక ప్రకటన పేర్కొంది. ఈ మేరకు ఎక్స్‌లో ఒక ట్వీట్ కనిపించింది. ఈ ట్వీట్‌ని ముంబై, చెన్నై, హైదరాబాద్ కోల్‌కతాలోని యూఎస్ కాన్సులేట్స్ రీట్వీట్ చేశాయి.
ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయంలో అమెరికా యంత్రాంగం ఎంత కఠినంగా ఉంటుందనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది.
అసలెలాంటీ ముందస్తు హెచ్చరికలు ఇవ్వకుండా, ఉన్నపళంగా స్టూడెంట్ వీసాలను అమెరికా ప్రభుత్వం రద్దు చేస్తున్న ఈ సమయంలో, కొత్త ప్రకటన భారతీయ విద్యార్థులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. పాలస్తీనా అనుకూల నిరసనల నుంచి ట్రాఫిక్ ఉల్లంఘనల వరకు ఏదో ఒక కారణం చెప్పి వీసాలు రద్దు చేస్తోంది ట్రంప్ యంత్రాంగం. దీని వల్ల విద్యార్థులు లీగల్‌గా పోరాటం చేయాల్సి వచ్చి మానసిక క్షోభకు గురవుతున్నారు.
అంతర్జాతీయ విద్యార్థుల సమాచారం కోసం డీపార్ట్మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీస్‌లో ఎస్ఈవీఐఎస్ అనే సిస్టెమ్ ఉంటుంది. ఇదొక వెబ్ ఆధారిత ప్లాట్‌ఫామ్. ఇటీవలి కాలంలో చాలా మంది విద్యార్థుల పేర్లు ఇందులో నుంచి మాయమైపోతున్నాయి. ఈ విషయం విద్యార్థులకే కాదు, యూనివర్సిటీలకు కూడా తెలియడం లేదు.
వీటన్నింటి మధ్య అమెరికాలో చదువుకున్న భారతీయ విద్యార్థులు, ఇతర దేశాల స్టూడెంట్స్‌కి మరో భయం పట్టుకుంది. గ్యాడ్యుయేషన్ తర్వాత అమెరికాలో ఉద్యోగం చేసేందుకు అనుమతినిచ్చే ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్)ని ట్రంప్ ప్రభుత్వం రద్దు చేస్తుందేమో అని సర్వత్రా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి అమెరికా చట్ట సభ్యులు ఇప్పటికే ఒక బిల్లును (ఫైర్నెస్ ఫర్ హై స్కీల్డ్ అమెరికన్స్ యాక్ట్ 2025) ప్రవేశపెట్టారు.
ఓపీటీ, ఎస్టీఈఓఎం ఓపీటీ ప్రోగ్రామ్స్‌ని రద్దు చేస్తామని యూఎస్సీఐఎస్ (అమెరికా సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్) చీఫ్ జోసెఫ్ ఎడ్లో మాటిమాటికి చెబుతూనే ఉంటున్నారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link