దీపికా పదుకోన్ వీడియోను నేను లైక్ చేయలేదు.. ఇన్‌స్టాగ్రామ్ దానికదే చేసింది: తమన్నా పోస్ట్ వైరల్

Best Web Hosting Provider In India 2024

దీపికా పదుకోన్ వీడియోను నేను లైక్ చేయలేదు.. ఇన్‌స్టాగ్రామ్ దానికదే చేసింది: తమన్నా పోస్ట్ వైరల్

Hari Prasad S HT Telugu

బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ఉన్న ఓ రీల్ ను తమన్నా లైక్ చేయడంతో సందీప్ రెడ్డి వంగా వివాదం విషయంలో ఆమె దీపికకు సపోర్ట్ చేస్తుందన్న వాదన మొదలైంది. ఈ నేపథ్యంలో దీనిపై తమన్నా ఓ ఇన్‌స్టా స్టోరీ ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

దీపికా పదుకోన్ వీడియోను నేను లైక్ చేయలేదు.. ఇన్‌స్టాగ్రామ్ దానికదే చేసింది: తమన్నా పోస్ట్ వైరల్

తన స్పిరిట్ మూవీ స్టోరీని లీక్ చేసిందంటూ బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ పై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మండిపడిన విషయం తెలుసు కదా. ఈ విషయంలో దీపికకు తాను సపోర్ట్ చేస్తున్నట్లుగా ఓ రీల్ ను లైక్ చేయడం ద్వారా తమన్నా చెప్పకనే చెప్పిందన్న వార్తలు వచ్చాయి. అయితే ఆ వీడియోను తాను లైక్ చేయలేదన్నట్లుగా ఇప్పుడు తమన్నా వివరణ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇన్‌స్టా దానికదే లైక్ చేసింది

తమన్నా భాటియా తన లైక్ వార్తపై ఇన్‌స్టా స్టోరీ ద్వారా వివరణ ఇచ్చింది. నేరుగా దీపికా పదుకోన్ పేరుగానీ, ఆమె ఉన్న రీల్ గురించిగానీ ప్రస్తావించకుండా.. తమన్నా తన సెల్ఫీని షేర్ చేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. “తనకు తానుగా పేజీలను ఎలా లైక్ చేస్తుందో ఇన్‌స్టాగ్రామ్ చెప్పగలదా? ఎందుకంటే ఎవరెవరో దీనిని పెద్ద వార్తగా మలిచేశారు. నాకు చేయాల్సిన పని చాలా ఉంది” అని తమన్నా రాసింది.

తమన్నా లైక్ చేసిన రీల్ ఇదే

తమన్నా భాటియా బుధవారం (మే 28) ఉదయం ఓ పాత రీల్ కు లైక్ కొట్టినట్లుగా వార్తలు వచ్చాయి. అందులో దీపికా పదుకోన్ తాను 2020లో చేసిన ఛపాక్ మూవీపై మాట్లాడింది. అందులో రణ్‌వీర్ ఈ ప్రొడక్షన్ హౌజ్ లో డబ్బులు పెట్టాడా అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అవి నా డబ్బులు.. మీకెవరు చెప్పారంటూ నవ్వుతూ అనడం చూడొచ్చు.

అగౌరవం, సెక్సిజం, జీతంలో లింగ భేదం, ఓవర్ టైమ్ పని చేయడం, ప్రొఫెషనలిజం లేకపోవడం, ద్వంద్వ ప్రమాణాలకు ఆమె వ్యతిరేకం అని రాసి ఉన్న రీల్ అది. దీనికి తమన్నా లైక్ కొట్టినట్లుగా ఉంది. దీంతో సందీప్ రెడ్డి వంగా వివాదం విషయంలో దీపికకు తమన్నా మద్దతుగా నిలిచిందన్న వార్తలు వచ్చాయి. దీంతో తమన్నా దీనిపై పరోక్షంగా వివరణ ఇచ్చింది.

దీపిక, సందీప్ వివాదం ఇదే..

సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ మూవీ అయిన స్పిరిట్ నుంచి దీపికా వెళ్లిపోవడానికి ఆ మూవీ టీమ్ చేసిన కొన్ని అన్‌ప్రొఫెషన్ డిమాండ్లే కారణమన్న వార్తలు వచ్చాయి. అయితే వెళ్తూ వెళ్తూ తన మూవీ స్టోరీని లీక్ చేసిందంటూ దీపికపై సందీప్ మండిపడుతూ ఇదేనీ నీ ఫెమినిజం అంటూ తీవ్రంగా మండిపడ్డాడు.

ఈ స్పిరిట్ మూవీ కోసం రోజుకు ఆరు గంటల కంటే ఎక్కువగా పని చేయబోనని, అగ్రిమెంట్లో ఉన్నట్లుగా 100 రోజుల షూటింగ్ దాటితే ప్రతి రోజూ అదనంగా చెల్లించాలని దీపిక డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఓవర్‌టైమ్ కు వ్యతిరేకంగా దీపిక చేస్తున్న పోరాటానికి తమన్నా ఇలా ఓ రీల్ ను లైక్ చేయడం ద్వారా మద్దతిచ్చినట్లు వార్తలు రావడంతో ఆమె నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. దీపిక వెళ్లిపోవడంతో ఆమె స్థానంలో స్పిరిట్ మూవీ కోసం తృప్తి డిమ్రిని తీసుకున్న విషయం తెలిసిందే.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024