





Best Web Hosting Provider In India 2024

ఒకే రోజు ఓటీటీలోకి రానున్న మూడు మలయాళ సినిమాలు.. ఓ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్ కూడా..
ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో మూడు మలయాళం మూవీస్ స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. వీటిలో ఓ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్ సినిమా కూడా ఉంది. జియోహాట్‌స్టార్, సన్ నెక్ట్స్, మనోరమ మ్యాక్స్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి ఈ సినిమాలు రానున్నాయి.
ఈవారం ఓటీటీ, థియేటర్లలోకి మలయాళం సినిమాలు క్యూ కడుతున్నాయి. వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి ఈ మూవీస్ వస్తున్నాయి. ఒకే రోజు మూడు మూవీస్ ఓటీటీలోకి, రెండు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి ఆ సినిమాలేంటి? వాటిని ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
బిగ్ బెన్ – సన్ నెక్ట్స్
బిగ్ బెన్ ఓ మలయాళం థ్రిల్లర్ మూవీ. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. సుమారు ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తోంది. సన్ నెక్ట్స్ ఓటీటీలో శుక్రవారం (మే 30) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇది యూకేలో ఉంటున్న జీన్ ఆంటోనీ, అతని భార్య లవ్లీ చుట్టూ తిరిగే స్టోరీ.
పోలీస్ ఆఫీసర్ అయిన జీన్.. ఓ రోజు లవ్లీతోపాటు పని చేసే వ్యక్తితో గొడవ పడటంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ల ఏడాదిన్నర కూతురిని అక్కడి వెల్ఫేర్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ మూవీ స్టోరీ. ఐఎండీబీలో 7.4 రేటింగ్ ఉన్న ఈ సినిమా మలయాళం ఆడియోతో రానుంది.
తుడరుం – జియోహాట్‌స్టార్
ఈ ఏడాది అతిపెద్ద మలయాళం బ్లాక్‌బస్టర్లలో ఒకటైన తుడరుం (Thudarum) కూడా శుక్రవారమే (మే 30) ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ఈ మూవీని జియోహాట్‌స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. మలయాళంతోపాటు తెలుగులోనూ రానుండటం విశేషం. ఇందులో బెంజ్ షణ్ముగం పాత్రలో మోహన్‌లాల్ నటించాడు. ఇదొక రివేంజ్ థ్రిల్లర్ మూవీ. థియేటర్లలో రూ.230 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ తుడరుం.. ఓటీటీలో మరింత మంచి రెస్పాన్స్ సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
డ్యాన్స్ పార్టీ – మనోరమ మ్యాక్స్
డ్యాన్స్ పార్టీ అనే మరో మలయాళ కామెడీ సినిమా కూడా శుక్రవారం (మే 30) ఓటీటీలోకి రానుంది. ఈ సినిమాను మనోరమ మ్యాక్స్ స్ట్రీమింగ్ చేయనుంది. షైన్ టామ్ చాకో, శ్రీనాథ్ భాసి నటించిన ఈ కామెడీ మూవీ.. అన్నదమ్ములు, వాళ్ల ప్రేమలు, పెళ్లిళ్ల చుట్టూ తిరిగే స్టోరీ. 2023లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మొత్తానికి ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.
ఓటీటీలోకి ఈ వారం ఒకే రోజు మూడు మలయాళం సినిమాలు రానుండగా.. అదే రోజు మరో రెండు మూవీస్ థియేటర్లలో రిలీజ్ కానుండటం విశేషం. మూన్‌వాక్, సూత్రవాక్యం అనే సినిమాలు ఈ శుక్రవారం (మే 30) థియేటర్లలోకి అడుగుపెడుతున్నాయి.
సంబంధిత కథనం