





Best Web Hosting Provider In India 2024

కన్నడ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. మూడు నెలల తర్వాత ఓటీటీలోకి.. ఐఎండీబీలో 7.9 రేటింగ్
కన్నడ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఒకటి మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. తాజాగా బుధవారం (మే 28) ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని సన్ నెక్ట్స్ ఓటీటీ అనౌన్స్ చేసింది. మరి ఈ మూవీ ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుందో చూడండి.
కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో సూపర్ హిట్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. మూడు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. 7.9 ఐఎండీబీ రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమాను.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సన్ నెక్ట్స్ స్ట్రీమింగ్ చేయనుంది.
నిమిత్త మాత్ర ఓటీటీ రిలీజ్ డేట్
మనం మాట్లాడుకుంటున్న కన్నడ పారాసైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు నిమిత్త మాత్ర (Nimitta Matra). ఈ సినిమా ఫిబ్రవరి 22న థియేటర్లలో రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే మూడు నెలలుగా డిజిటల్ ప్రీమియర్ మాత్రం కాలేదు. మొత్తానికి ఈ శుక్రవారం (మే 30) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది.
“ఇద్దరు వ్యక్తులు ఒకే హంతకుడి కోసం వెతుకుతున్నారు. కానీ పట్టుకోలేకపోయారు? ఎలా తప్పించుకుంటాడు? తెలుసుకోండి – ఈ శుక్రవారం, మీ సన్ నెక్ట్స్ లోకి “నిమిత్త మాత్ర”” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను షేర్ చేసింది.
ఈ విషయాన్ని ఆ ఓటీటీ బుధవారం (మే 28) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఐఎండీబీలో 7.9 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు థియేటర్లలోనూ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.
నిమిత్త మాత్ర మూవీ గురించి..
నిమిత్త మాత్ర ఓ పారాసైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఇది విక్రమ్ (పూర్ణచంద్ర మైసూర్) అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చుట్టూ తిరిగే కథ. అతడు తన తండ్రి బాటలోనే వెళ్తూ 15 ఏళ్ల కిందట మంగళూరులో జరిగిన ఓ హత్య కేసు వెనుక మిస్టరీని ఛేదించే పనిలో ఉంటాడు. అతడు తవ్విన కొద్దీ కొన్ని రహస్యాలు వెలుగు చూస్తూ ఉంటాయి. ఆ కేసును విక్రమ్ పరిష్కరిస్తాడా లేదా అన్నదే నిమిత్త మాత్ర మూవీ స్టోరీ.
మొదటి నుంచి చివరి వరకూ సీట్లకు అతుక్కుపోయి చూసేలా సస్పెన్స్ తో కూడిన మంచి థ్రిల్లర్ మూవీ ఇది. నిమిత్త మాత్రకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియెన్స్ కూడా ఐఎండీబీలో 7.9 రేటింగ్ ఇచ్చారు. మంచి థ్రిల్లర్ మూవీ చూడాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. శుక్రవారం (మే 30) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాను ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు.
సంబంధిత కథనం