




Best Web Hosting Provider In India 2024

నెట్‍ఫ్లిక్స్‌లో ఈనెల టాప్-5 సినిమాలు.. తెలుగులో నాలుగు: వివరాలివే
నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈనెల కొన్ని పాపులర్ చిత్రాలు వచ్చాయి. ఇందులో కొన్ని బ్లాక్‍బస్టర్ సినిమాలు ఉన్నాయి. చివరి వారం రెండు చిత్రాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఆ వివరాలు ఇవే..
పాపులర్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్‌లో ఈ మే నెలలో చాలా చిత్రాలు అడుగుపెట్టాయి. వీటిలో కొన్ని పాపులర్ సినిమాలు ఉన్నాయి. ఈ చివరి వారంలో మరో రెండు యాక్షన్ సినిమాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. వీటిలో రెండు తెలుగు సినిమాలు ఉండగా.. రెండు తమిళ చిత్రాలు తెలుగు డబ్బింగ్‍లోనూ అడుగుపెట్టాయి. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈనెల వచ్చిన టాప్-5 సినిమాలు ఇవే..
గుడ్ బ్యాడ్ అగ్లీ
తమిళ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఇదే నెల స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మే 8వ తేదీన తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఎంట్రీ ఇచ్చింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కామెడీ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైంది. సుమారు రూ.200కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.
ది డిప్లొమాట్
బాలీవుడ్ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం ‘ది డిప్లొమాట్’ మే 9వ తేదీన నెట్‍ఫ్లిక్స్‌లో అడుగుపెట్టింది. జాన్ అబ్రహాం, సాదియా ఖతీబ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ మార్చి 14న థియేటర్లలో విడుదలై మంచి హిట్ సాధించింది. పాకిస్థాన్‍లో చిక్కుకున్న ఓ భారతీయ మహిళను స్వదేశానికి తీసుకొచ్చేందుకు దౌత్యవేత్త జేపీ సింగ్ చేసిన ప్రయత్నాలతో ఈ చిత్రం రూపొందింది. నిజజీవిత ఘటనలతో ఈ సినిమాను శివమ్ నాయర్ తెరకెక్కించారు. ది డిప్లొమాట్ చిత్రం హిందీలో స్ట్రీమ్ అవుతోంది.
హిట్ 3
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హిట్ 3’ సినిమా మే 29న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలోనూ అందుబాటులోకి వస్తుంది. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం మే 1న థియేటర్లలో విడుదలైంది. రూ.100కోట్లకుపైగా కలెక్షన్లతో బ్లాక్‍బస్టర్ సాధించింది. థియేటర్లలో రిలీజైన నెలలోగానే మే 29న నెట్‍ఫ్లిక్స్‌లో ఈ హిట్ 3 చిత్రం వస్తోంది.
జాక్
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘జాక్’ చిత్రం మే 8వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ తెలుగు స్పై యాక్షన్ కామెడీ మూవీ హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల డబ్బింగ్‍లోనూ అడుగుపెట్టింది. ఈ చిత్రంలో సిద్ధు సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్‍గా చేశారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో రిలీజైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.
రెట్రో
తమిళ రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘రెట్రో’ ఈనెలాఖరు మే 31వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అడుగుపెట్టనుంది. తమిళ స్టార్ సూర్య నటించిన ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 1వ తేదీన థియేటర్లలో రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ రూ.200కోట్లకు పైగా వసూళ్లతో మంచి హిట్ సాధించింది. నెలలోనే నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇస్తోంది.
సంబంధిత కథనం