





Best Web Hosting Provider In India 2024

మలయాళం బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్ తుడరుం డైరెక్టర్ తీసిన ఈ సినిమాలు చూశారా? అన్నీ సూపర్ హిట్ మూవీసే.. ఈ ఓటీటీల్లో చూడండి
మలయాళం బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్ మూవీ తుడరుం డైరెక్ట్ చేసిన తరుణ్ మూర్తి ఇప్పటి వరకూ మూడే సినిమాలు తీశాడు. కానీ అన్నీ సూపర్ డూపర్ హిట్లే. ఒక్కోటి ఒక్కో జానర్ మూవీస్. రెండు ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. తుడరుం రానుంది.
ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ తుడరుం (Thudarum). ఈ రివేంజ్ థ్రిల్లర్ థియేటర్లలో దుమ్ము రేపిన తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీని డైరెక్ట్ చేసిన తరుణ్ మూర్తి గతంలో తీసిన సినిమాల గురించి తెలుసుకోండి. ప్రస్తుతం అవి ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేయండి.
తరుణ్ మూర్తి మూవీస్ ఇవే
మలయాళం డైరెక్టర్ తరుణ్ మూర్తి తీసింది మూడు సినిమాలే. కానీ అన్నీ బ్లాక్‌బస్టర్లే. అందులోనూ ఒక్కో మూవీ ఒక్కో జానర్లో తీసి సక్సెస్ సాధించడం అన్నది మామూలు విషయం కాదు.
తొలి సినిమా క్రైమ్ థ్రిల్లర్ కాగా.. రెండోది ఓ డ్రామా. ఇక ఈ ఏడాది మోహన్‌లాల్ తో తుడరుం అనే రివేంజ్ థ్రిల్లర్ తీసి మరో సక్సెస్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో అతని గత సినిమాలకు ఓటీటీల్లో డిమాండ్ పెరిగింది.
ఆపరేషన్ జావా ఓటీటీ స్ట్రీమింగ్
తరుణ్ మూర్తి తొలిసారి 2021లో ఆపరేషన్ జావా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ సినిమా. సైబర్ నేరాల చుట్టూ తిరిగే కథ. ఇద్దరు యువ ఇంజినీర్లు ఉద్యోగం కోసం చూస్తూ.. ఈ నేరాలను పరిష్కరించడానికి సైబర్ క్రైమ్ పోలీసులకు సాయం చేస్తుంటారు.
అసలు సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది? ఈ కేసులను పోలీసులు ఎలా పరిష్కరిస్తారన్నది ఈ ఆపరేషన్ జావా సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమా జీ5 ఓటీటీలో మలయాళం ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక జియోహాట్‌స్టార్, యూట్యూబ్ లలో హిందీ ఆడియోతోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమాకు ఐఎండీబీలో 8 రేటింగ్ ఉంది.
సౌదీ వెల్లక్క ఓటీటీ స్ట్రీమింగ్
తరుణ్ మూర్తి మరుసటి ఏడాది అంటే 2022లో క్రైమ్ డ్రామా అయిన సౌదీ వెల్లక్క మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇదో సింపుల్ స్టోరీ. చిన్న విషయాలకే గొడవ పడే పొరుగింటి ముసలావిడను ఓ మైనర్ ను కొట్టిన కేసులో ఇరికించి ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిప్పే ఓ వ్యక్తి కథ.
ఇది ప్రేక్షకులను భావోద్వేగాలకు గురి చేసే మూవీ. సమాజంలో ద్వేషం అనేది సాటి మనిషి జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో ఈ సినిమా ద్వారా తరుణ్ మూర్తి చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా యూట్యూబ్ లోనూ తెలుగులో అందుబాటులో ఉంది. ఈ మూవీకి కూడా ఐఎండీబీలో ఏకంగా 8 రేటింగ్ నమోదు కావడం విశేషం.
తుడరుం ఓటీటీ రిలీజ్ డేట్
ఇక ఈ ఏడాది మోహన్‌లాల్, శోభన జంటగా తుడరుం అనే మరో రివేంజ్ థ్రిల్లర్ ను తరుణ్ మూర్తి తెరకెక్కించాడు. ఈ సినిమా పోలీసులు తనకెంతో ఇష్టమైన అంబాసిడర్ కారును సీజ్ చేసిన తర్వాత దాని కోసం బెంజ్ షణ్ముగం (మోహన్ లాల్) అనే వ్యక్తి ఏం చేశాడన్న స్టోరీతో తెరకెక్కింది.
ఈ మూవీ శుక్రవారం (మే 30) నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. బాక్సాఫీస్ దగ్గర రూ.230 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ మూవీ ఓటీటీలో మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకు కూడా ఐఎండీబీలో 8.1 రేటింగ్ నమోదైంది.
సంబంధిత కథనం