



Best Web Hosting Provider In India 2024
అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరితే, ఫ్రీగా గోల్డెన్ డోమ్ రక్షణ: కెనడాకు ట్రంప్ ఆఫర్
అమెరికాలో 51 వ రాష్ట్రంగా చేరాలని పొరుగుదేశం కెనడాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కోరారు. అమెరికాలో 51 వ రాష్ట్రంగా చేరితే అమెరికా కోసం రూపొందిస్తున్న ‘గోల్డెన్ డోమ్’ రక్షణ వ్యవస్థను కెనడాకు కూడా విస్తరిస్తామని ఆయన ఆఫర్ ఇచ్చారు.
మెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కెనడాను అమెరికాలో భాగం చేయాలన్న తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. అమెరికాలో చేరాలన్న ఆయన అభ్యర్థనను కెనడా ఇప్పటికే విస్పష్టంగా తిరస్కరించింది. అయితే, ఈసారి, ఒక ఆఫర్ తో ఆయన వచ్చారు. అమెరికా కోసం రూపొందిస్తున్న ‘గోల్డెన్ డోమ్’ రక్షణ వ్యవస్థను కెనడాకు కూడా విస్తరిస్తామని తాజాగా ఆయన ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.
‘గోల్డెన్ డోమ్’ వ్యవస్థ
అమెరికా కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థ ‘గోల్డెన్ డోమ్‘ ను ట్రంప్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, హైపర్సోనిక్ ఆయుధాల వంటి ఆధునిక ముప్పుల నుంచి 175 బిలియన్ డాలర్ల క్షిపణి కవచం దేశాన్ని రక్షిస్తుంది. 2029 నాటికి ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. అమెరికాలో ప్రస్తుతం 50 రాష్ట్రాలు ఉన్నాయి. కెనడాను 51వ రాష్ట్రంగా యునైటెడ్ స్టేట్స్ లో చేరాలని, అలా చేస్తే కెనడాకు కూడా గోల్డెన్ డోమ్’ రక్షణ వ్యవస్థను అందిస్తామని ట్రంప్ తాజాగా ఆఫర్ చేశారు.
61 బిలియన్ డాలర్లు
“మా అద్భుతమైన గోల్డెన్ డోమ్ సిస్టమ్లో భాగం కావాలనుకునే కెనడాకు నేను చెప్పాను, అవి ప్రత్యేకమైన, కానీ మా ఆఫర్ ను తిరస్కరించి, ప్రత్యేక దేశంగా కొనసాగాలనుకుంటే కెనడాకు 61 బిలియన్ డాలర్లు ఖర్చవుతుంది” అని ట్రంప్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. కెనడా అమెరికాకు 51వ దేశంగా మారితే రక్షణ వ్యవస్థకు సున్నా డాలర్లు ఖర్చవుతుందని, కెనడా ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోందని అమెరికా అధ్యక్షుడు తెలిపారు.
కెనడా ప్రధాని మార్క్ కార్నీ
ఫెడరల్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కెనడా ప్రధాని మార్క్ కార్నీ మే నెలలో ట్రంప్ ను కలిశారు. ఈ పర్యటనలో గోల్డెన్ డోమ్ కార్యక్రమంపై ఇరువురు నేతలు చర్చించారు. గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని కార్నే విలేకరులతో చెప్పారు. అయితే, కెనడా “అమ్మకానికి ఎప్పటికీ ఉండదు’ అని అన్నారు. ముఖ్యంగా ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా, కెనడాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆయన సుంకాల హెచ్చరికలు, కెనడాను అమెరికాలో విలీనం చేయాలనే ఒత్తిడితో రెండు ఉత్తర అమెరికా దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తూనే ఉన్నాయి.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link