




Best Web Hosting Provider In India 2024

వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం – ఏపీ, తెలంగాణకు అతి భారీ వర్ష సూచన…!
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం… వాయుగుండంగా మారింది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఉత్తర బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం… వాయుగుండంగా మారింది. ఇవాళ తీరం దాటే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణశాఖ హెచ్చరికలను జారీ చేసింది.
ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు…
ఏపీలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా అల్లూరి జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 31 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటుగా, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం,వైఎస్ఆర్ కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల నేపధ్యంలో ఆకస్మిక వరదలకు అవకాశం ఉన్నందున గోదావరి,నాగావళి,వంశధార నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
తెలంగాణలో అతి భారీ వర్షాలు…
ఇవాళ తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
రేపు కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 1వ తేదీ తర్వాత కొన్నిచోట్ల తేలికపాటి లేదా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చు. జూన్ 2వ తేదీ నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సంబంధిత కథనం
టాపిక్