



Best Web Hosting Provider In India 2024
ట్రంప్ ప్రభుత్వ విధుల నుంచి వైదొలగిన ఎలాన్ మస్క్; ‘డోజ్’ కు దూరం; కారణమిదే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో విబేధాలు తలెత్తడంతో యూఎస్ ప్రభుత్వంలోని ‘డోజ్’ లో తాను చేపట్టిన ప్రత్యేక విధుల నుంచి వైదొలగుతున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. అమెరికాతో తన ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగి పాత్ర ముగిసిందని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీలో (DOGE) భాగంగా ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా తన సమయం ముగిసిందని బిలియనీర్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు.
డోజ్ లో విధులకు దూరం
‘ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా నా షెడ్యూల్ సమయం ముగిసింది. ప్రభుత్వంలో వృథా ఖర్చులను తగ్గించడానికి అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డోజ్ మిషన్ కాలక్రమేణా బలపడుతుంది, ఎందుకంటే ఇది ప్రభుత్వం అంతటా ఒక జీవన విధానంగా మారుతుంది” అని ఎలాన్ మస్క్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
వైట్ హౌజ్ ధ్రువీకరణ
ట్రంప్ ప్రభుత్వం నుంచి ఎలన్ మస్క్ వైదొలగుతున్నట్లు వైట్ హౌస్ అధికారి ఒకరు అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ ధృవీకరించింది. ఎలాన్ మస్క్ యూఎస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వైదొలగడం వాస్తమేనని, ఈ రాత్రికి అతని ఆఫ్ బోర్డింగ్ ప్రారంభమవుతుందని ఆ అధికారి తెలిపారు. ట్రంప్ ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీలో (DOGE) లో ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా ఎలాన్ మస్క్ 130 రోజుల పదవీ కాలం మే 30తో ముగిసింది. ఫెడరల్ ప్రభుత్వ వ్యయాన్నితగ్గించడానికి డోజ్ ప్రయత్నాలు కొనసాగుతాయని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది.
ట్రంప్ పన్ను బిల్లుపై ఎలాన్ మస్క్ ఏమన్నారంటే?
డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఒక బిల్లుపై మస్క్ వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ట్రంప్, మస్క్ ల మధ్య విబేధాలు ప్రారంభమయ్యాయి. ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘బిగ్, బ్యూటీఫుల్ బిల్’ ను మస్క్ ఇటీవల తీవ్రంగా విమర్శించారు. ఆ బిల్లులో కొత్తగా పన్ను విధింపులు, మెరుగైన ఇమ్మిగ్రేషన్ అమలు మొదలైనవి ఉంటాయి. సిబిఎస్ తో మాట్లాడుతూ, మస్క్ దీనిని “భారీ వ్యయ బిల్లు”గా అభివర్ణించారు. ‘‘ఇది ఫెడరల్ లోటును పెంచుతుంది. డీఓజీఈ అని పిలువబడే నా డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ పనిని బలహీనపరుస్తుంది’’ అన్నారు.
బిల్లుపై చర్చ
మస్క్ సీబీఎస్ ఇంటర్వ్యూ మంగళవారం రాత్రి బయటకు వచ్చింది. బుధవారం ఓవల్ కార్యాలయంలో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ ఈ చట్టంపై సంప్రదింపులు జరపడంలో ఉన్న సున్నితమైన రాజకీయాల గురించి మాట్లాడటం ద్వారా తన ఎజెండాను సమర్థించుకున్నారు. అందులోని కొన్ని అంశాల పట్ల తాను సంతోషంగా లేనని, కానీ ఇతర అంశాలతో తాను థ్రిల్ కు గురయ్యానని చెప్పారు. మరిన్ని మార్పులు చేయవచ్చని ట్రంప్ సూచించారు. రిపబ్లికన్లు ఇటీవల ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టి సెనేట్ లో చర్చిస్తున్నారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link