





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ మూవీ – పది నెలల తర్వాత స్ట్రీమింగ్ – రెండు ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్!
తెలుగు కామెడీ మూవీ మారుతి నగర్ సుబ్రమణ్యం మరో ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీలో రావురమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలు పోషించారు.
తెలుగు కామెడీ డ్రామా మూవీ మారుతి నగర్ సుబ్రమణ్యం మరో ఓటీటీలోకి వచ్చింది. ఇప్పటికే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్‌గా ప్రకటించింది. థియేటర్లలో రిలీజైన పది నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు ఈ మూవీ అందుబాటులోకి రావడం గమనార్హం.
ఐదు కోట్లకుపైగా కలెక్షన్స్…
మారుతి నగర్ సుబ్రమణ్యం మూవీలో రావురమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి ప్రధాన పాత్రలు పోషించారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించాడు. గత ఏడాది ఆగస్ట్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. దాదాపు నాలుగు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఐదు కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
రావురమేష్ కామెడీ టైమింగ్
మారుతి నగర్ సుబ్రమణ్యంలో లీడ్ రోల్‌లో తన కామెడీ టైమింగ్, యాక్టింగ్‌తో ఆడియెన్స్‌ను రావురమేష్ మెప్పించాడు. బ్యాంకు అధికారులు చేసే పొరపాట్ల కారణంగా ఒకరి ఖాతాలో పడాల్సిన డబ్బు మరొకరి ఖాతాలో పడితే ఎలాంటి గందరగోళం నెలకొంటుంది అనే పాయింట్‌కు ఫ్యామిలీ డ్రామా, ఫన్‌ను జోడించి దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు.
సుబ్రమణ్యం డబ్బు కష్టాలు…
మారుతీనగర్‌కు చెందిన సుబ్రమణ్యం(రావురమేష్) డీఎస్‌సీ రాసి టీచర్ జాబ్‌కు సెలెక్ట్ అవుతాడు. కానీ కోర్టు కేసు కారణంగా ఆ జాబ్ పెండింగ్‌లో పడుతుంది. కేసులు తొలగిపోయి ఎప్పటికైనా ఆ జాబ్ తనకు వస్తుందనే ఆశతో పాతికేళ్లుగా ఎలాంటి ఉద్యోగం చేయకుండా భార్య కళారాణి సంపాదనపై ఆధారపడి బతుకుంతుంటాడు. చనిపోయిన తన తల్లి అస్థికలను పుణ్యనదుల్లో కలపడానికి తీర్థయాత్రలకు వెళుతుంది కళారాణి.
తల్లి ఇన్సురెన్స్ డబ్బులు పది లక్షలు రావడంతో వాటిని ఇళ్లు కట్టడానికి ఉపయోగించాలని అనుకొని సుబ్రహ్మణ్యం అకౌంట్‌లో వేస్తుంది కళారాణి. భార్యే ఈ డబ్బులు పంపించిందని తెలియక సుబ్రహ్మణ్యం ఆ డబ్బును ఖర్చుపెట్టేస్తాడు. ఆ తర్వాత ఏమైంది?
తీర్థయాత్రల నుంచి భార్య వచ్చే లోపు తిరిగి పది లక్షలు సంపాదించడానికి సుబ్రమణ్యం ఎలాంటి తంటాలు పడ్డాడు? సుబ్రమణ్యం కొడుకు అర్జున్‌కు…నిర్మాత అల్లు అరవింద్‌కు ఉన్న సంబంధం ఏమిటి? కాంచన (రమ్య పసుపులేటి)ను ప్రేమించిన అర్జున్ ఆమెను పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
సంబంధిత కథనం