నేను 15 తెలుగు సినిమాలు చేస్తే 13 విజయవంతం అయ్యాయి.. ఫ్లాప్స్ మాత్రమే నేను ఇచ్చాను.. హీరో కమల్ హాసన్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

నేను 15 తెలుగు సినిమాలు చేస్తే 13 విజయవంతం అయ్యాయి.. ఫ్లాప్స్ మాత్రమే నేను ఇచ్చాను.. హీరో కమల్ హాసన్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించారు. తాజాగా మే 29న వైజాగ్‌లో థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో కమల్ హీసన్ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

నేను 15 తెలుగు సినిమాలు చేస్తే 13 విజయవంతం అయ్యాయి.. ఫ్లాప్స్ మాత్రమే నేను ఇచ్చాను.. హీరో కమల్ హాసన్ కామెంట్స్

ఈ సంవత్సరం భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో “థగ్ లైఫ్” ఒకటి. లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్

త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో మే 29న గ్రాండ్‌గా నిర్వహించారు. థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వైజాగ్ గురించి, తెలుగు ప్రేక్షకుల గురించి, సినిమాలపై హీరో కమల్ హాసన్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెబుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

21 ఏళ్ల వయసులో

హీరో కమల్ హాసన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారాలు. వైజాగ్ ప్రజలు నన్ను ఎంతగానో దగ్గరకి తీసుకున్నారు. 21 ఏళ్ల వయసులో ఇక్కడికి వచ్చాను. అప్పటికి నా మొహం కూడా ఎవరికి తెలీదు. షూటింగ్ చాలా సాఫీగా జరిగింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ కూడా నడవలేని ఫ్యాన్ బేస్‌ని ‘మరో చరిత్ర’ అనే చిత్రం ఇచ్చింది. తర్వాత ఏక్ తుజే కేలియే సినిమా చేసినప్పుడు కూడా తెలుగు ప్రేక్షకులు మన కుర్రాడు హిందీకి వెళ్లి కొట్టాడురా అని అభినందించారు” అని అన్నారు.

బ్యాడ్ ఫిలిమ్స్ మర్చిపోయి

“అలాంటి వైజాగ్‌లో సాగర సంగమం, ఏక్ తుజే కేలియే, శుభసంకల్పం సినిమాలు చేశాను. ఇది నాకు సొంత ఇల్లు లాంటిది. మంచి ఆర్ట్ ఎక్కడ కనిపించినా దానికి నేను సెల్యూట్ చేస్తాను. అలాగే నేర్చుకున్నాను. నేను కొన్ని బ్యాడ్ ఫిలిమ్స్ చేశాను. అయితే నా బ్యాడ్ ఫిలిమ్స్ మర్చిపోయి కేవలం మంచి సినిమాలనే గుర్తుపెట్టుకున్నారు. అందుకుగాను మనస్పూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని కమల్ హాసన్ తెలిపారు.

విజయాలను మీరే ఇచ్చారు

“మంచి సినిమాలు మీకు అందించడం నా బాధ్యత. నేను 15 తెలుగు సినిమాలు చేస్తే అందులో 13 విజయవంతమైన చిత్రాలుగా నిలిచాయి. ఆ విజయాల్ని మీరే ఇచ్చారు. ప్లాప్స్ మాత్రమే నేను ఇచ్చాను. ఇది నిజం. ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికి థగ్ లైఫ్ సినిమా మీకు అందిస్తున్నాను. ఒక కళాకారుడు చేసే పని ఇదే. చాలా గ్రేట్ ఫిలిం ఇది” అని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.

నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో

శింబు బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారు. నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో కనిపించారు. అభిరామి గారు అద్భుతమైనటువంటి నటన కనబరిచారు. నాజర్ గారితో నాది వెరీ లాంగ్ జర్నీ. ఆయన లాంటి నటుడు దొరకడం చాలా కష్టం. త్రిష పర్ఫామెన్స్‌ని చాలా ఎంజాయ్ చేస్తారు” అని కమల్ హాసన్ పేర్కన్నారు.

కరెక్టా కాదా మీరే చెప్పాలి

“చాలా గొప్ప సినిమా చేశామని మేము నమ్ముతున్నాం. జూన్ 5న మేము అనుకున్నది కరెక్టా లేదా అనేది మీరు సినిమా చూసి చెప్పాలి. ఈ సినిమాకి మీరు ఇచ్చే రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నాను. జూన్ 5న అందరం థియేటర్స్‌లో కలుద్దాం” అని కమల్ హాసన్ తన స్పీచ్ ముగించారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024