బడ్జెట్ తక్కువ.. కలెక్షన్లు ఎక్కువ.. ఒకటేమో తమిళ్ ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా.. మరొకటి మలయాళ థ్రిల్లర్.. ఈ రెండు ఒకే ఓటీటీలో!

Best Web Hosting Provider In India 2024

బడ్జెట్ తక్కువ.. కలెక్షన్లు ఎక్కువ.. ఒకటేమో తమిళ్ ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా.. మరొకటి మలయాళ థ్రిల్లర్.. ఈ రెండు ఒకే ఓటీటీలో!

రీసెంట్ గా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రెండు సినిమాల పేర్లు చాలా స్ట్రాంగ్ గా వినిపించాయి. అతి తక్కువ బడ్జెట్ తో థియేటర్లకు వచ్చిన ఈ మూవీస్.. బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టాయి. అందులో ఒకటి తమిళ్ మూవీ, మరొకటి మలయాళం సినిమా. ఈ రెండు సినిమాల ఓటీటీ వేదిక ఒకటే.

ఒకే ఓటీటీలో రెండు బ్లాక్ బస్టర్లు (x)

కథ బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా, బడ్జెట్ తో పని లేకుండా ఏ సినిమా అయినా పాన్ ఇండియా, ప్రపంచ స్థాయిలో సూపర్ హిట్ అవుతోంది. ఇక ఓటీటీలు వచ్చాక సినిమాను చూసేందుకు భాషతో పనే లేకుండా పోయింది. కంటెంట్ బాగున్న సినిమాలను ఆడియన్స్ ఆదరిస్తూనే ఉన్నారు. అలాంటి కంటెంట్ తో, తక్కువ బడ్జెట్ తో థియేటర్లకు వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ, తుడరుమ్ సినిమాలు దుమ్మురేపాయి. ఈ రెండు సినిమాలకు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఒకటే.

రాజమౌళి మెచ్చిన సినిమా

సూపర్ స్టార్ రజనీకాంత్, టాప్ డైరెక్టర్ రాజమౌళితో పాటు సూర్య, నాని లాంటి వాళ్ల ప్రశంసలు ఓ చిన్న సినిమా అందుకుంది. ఇప్పుడు అదే మూవీ హాట్ టాపిక్ గా మారింది. ఆ ఫిల్మే ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. శశికుమార్, సిమ్రాన్ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ మూవీ థియేటర్లను షేక్ చేస్తోంది. కేవలం సుమారు రూ.16 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కిన టూరిస్ట్ ఫ్యామిలీ ఏకంగా రూ.77 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

ఆ ఓటీటీలోకి

టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా జియోహాట్‌స్టార్‌ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రాబోతోంది. మే 1న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నెల రోజుల తర్వాత జూన్ 2న డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ తమిళ్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

అభిషాన్ జీవింత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ.. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా మన దేశానికి అక్రమంగా వలస వచ్చిన ఓ ఫ్యామిలీ కథ. అరెస్టు బెదిరింపులు, దూరంగా ఉంచే చుట్టుపక్కల వాళ్లు.. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఫ్యామిలీ ఎమోషన్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.

మలయాళం థ్రిల్లర్

మరోవైపు మలయాళం థ్రిల్లర్ మూవీ తుడరుమ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. సుమారు రూ.30 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమా థియేటర్లలో రూ.230 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కేరళలోనే రూ.100 కోట్లు కొల్లగొట్టిన ఫస్ట్ మలయాళం సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది. మోహన్ లాల్ లీడ్ రోల్ లో నటించిన ఈ థ్రిల్లర్ మూవీ ఈ రోజే (మే 30) ఓటీటీలోకి వచ్చింది.

అయిదు భాషల్లో

తుడరుమ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. శుక్రవారం నుంచే జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో ఈ మూవీ ప్లే అవుతోంది. తరుణ్ మూర్తి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో మోహన్ లాల్ సరసన చాలా కాలం తర్వాత శోభన యాక్ట్ చేశారు. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024